»   » అల్లు అర్జున్... నాన్నపై ప్రేమతో (ఫోటో)

అల్లు అర్జున్... నాన్నపై ప్రేమతో (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ తెలుగు నిర్మాత అల్లు అరవింద్ జనవరి 10తో 67వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా పుట్టినరోజు వేడుకలను ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. అంతా కలిసి హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో డిన్నర్ కి వెళ్లిన సందర్భంగా నాన్నతో కలిసి దిగిన సెల్ఫీని అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసారు.

ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య.....డబ్బింగ్ చిత్రాలతో నిర్మాతగా కెరీర్ ప్రారంభించారు. అప్పట్లో కొన్ని చిత్రాల్లో ఆయన నటుడిగా కూడా కనిపించారు. తర్వాత పూర్తిగా సినిమా నిర్మాణం వైపు అడుగులు వేసారు. నిర్మాతగా ఆయన తనకంటే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తొలి చిత్రం దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన 'దేవుడే దిగివస్తే'. ఈ చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించింది.

Allu Aravind turns 67

చిరంజీవి ‘మెగాస్టార్'గా ఎదగడంలో తెర వెనక అన్ని విధాలుగా సపోర్టుగా నిలిచింది అల్లు అరవిందే. అదే క్రమంలో గీతా ఆర్ట్స్ బేనర్లో పలు విజయవంతమైన సినిమాల చేస్తూ టాలీవుడ్ బడా నిర్మాతగా ఎదిగారు.

మరో వైపు పవన్ కళ్యాణ్‌ను హీరోగా పరిచయం చేసిన ఘనత కూడా అల్లు అరవిందే. మేనల్లుడు రామ్ చరణ్ రెండో సినిమానే అత్యంత భారీగా నిర్మించి 'మగధీర'తో అదిరిపోయే హిట్‌ను సొంతం చేసుకున్నారు అరవింద్. తన కొడుకు అల్లు అర్జున్ ను ఇండస్ట్రీలో టాప్ హీరోగా నిలబెట్టడంలో సక్సెస్ అయ్యారు.

English summary
Allu Aravind turned an year older on January 10th and he now ages 67. Mega Producer celebrated his birthday with family members Yesterday.
Please Wait while comments are loading...