విజయ్ దేవరకొండ మహా ముదురు.. చిరంజీవి మాదిరిగానే.. అల్లు అరవింద్
Recommended Video

గీతా ఆర్ట్స్ (జీఏ2) బ్యానర్‌పై రూపొందిన గీత గోవిందం చిత్రం భారీ కలెక్షన్లను సాధిస్తున్నది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ చిత్రానికి అనూహ్య స్పందన లభిస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్‌తోపాటు మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఆయన ఏమన్నారంటే..

లీక్‌తో ఒత్తిడి
గీతా గోవిందం సినిమా లీక్ అయిందనే వార్తతో చాలా ఒత్తిడికి గురయ్యాం. కానీ ఈ సినిమాపై ప్రేక్షకులు చూపించిన ఆదరణకు చాలా కృతజ్ఞతలు. దర్శకుడు పరుశురామ్ గొప్ప రచయిత. ఓ మంచి రచయిత, నటుడు కలిస్తే ఎలా ఉంటుందని చెప్పడానికి గీతా గోవిందం ఓ ఉదాహరణ అని అల్లు అరవింద్ అన్నారు.

విజయ్ దేవరకొండకు గొప్ప టాలెంట్
యువతరం నటుల్లో విజయ్ దేవరకొండకు గొప్ప టాలెంట్ ఉంది. కొన్ని విషయాల్లో చిరంజీవికి, విజయ్ దేవరకొండకు సారుప్యత ఉంది. అవతలి వ్యక్తులు ఎవరైనా వారికి ఏమైనా చెబితే అలానే అంటూ వింటారు. కానీ ఎవరెన్ని చెప్పిన వారి ఆలోచనతోనే ముందుకెళ్తారు. అయితే చిరంజీవిలానే అమాయకంగా కనిపించే విజయ్ చాలా ముదురు అని అల్లు అరవింద్ పేర్కొన్నారు.

పరుశురామ్ కారణం
గీతా గోవిందం సక్సెస్ మీట్ విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. బన్నీవాస్ ఈ కథ వినమని కోరినప్పుడు కొంత ఆలోచించాను. కానీ ఇది యూనివర్సల్ సినిమా అవుతుందని ఒప్పించాడు. ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించిందంటే కారణం దర్శకుడు పరుశురామ్ మాత్రమే అని అన్నారు.

అల్లు అరవింద్ వల్లనే
గీత గోవిందం రిలీజ్‌ను అల్లు అరవింద్ గొప్పగా ప్లాన్ చేశాడు. షూటింగ్‌కు కానీ, సెట్స్ గానీ ఎక్కువ సార్లు రాలేదు. కానీ ఎడిటింగ్ రూమ్‌లో చాలా శ్రద్దపెట్టి సినిమా గొప్పగా రావడానికి కారణమయ్యారు. అల్లు అరవింద్ ఇచ్చిన అవకాశాన్ని గొప్పగా ఉపయోగించుకొన్నానని భావిస్తున్నా అని విజయ్ దేవరకొండ అన్నారు.


Click it and Unblock the Notifications











