కెసిఆర్ చిల్లర పనులు అరికట్టకపోతే షూటింగ్ లు ఆపేస్తాం: అల్లు అరవింద్
టిఆర్ ఎస్ కార్యకర్తలు గూండాల్లా బిహేవ్ చేస్తూ మా షూటింగ్ లపై దాడులు చేస్తే షూటింగ్ లు మొత్తం ఆపేస్తాం. షూటింగ్ లే కాదు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న థియేటర్లన్నీ మూసేస్తాం. ఇలా చేయటం వల్ల తెలంగాణ వస్తుంది. వస్తుంది అనుకుంటే మా షూటింగ్ లను నిలిపేస్తాం అంటూ అల్లు అరవింద్ కెసిఆర్ ను ఉద్దేశించి మాట్లాడారు. ఏదేమైనా ఈ జరుగుతున్న ఇన్సిడెంట్స్ వెనుక ఏవరి ప్రమేయం ఉందనేది కోట్ల మంది ప్రజలు చూస్తూనే ఉన్నారు. వారు తప్పకుండా స్పందిస్తారు అని అల్లు అరవింద్ పేర్కొన్నారు.
మోహన్ బాబు కుమారుడు షూటింగ్ పై మంగళవారంనాడు దాడి జరిగినప్పుడే పరిశ్రమ స్పందించి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఫిలించాంబర్ ఇప్పటికైనా స్పందించాలని సూచించారు. ఇది ఏదో రెండు సినిమాల షూటింగ్ లపై జరిగిన దాడిగా అనుకుంటే పొరపాటనీ, ఇది మిగతా వాటికి కూడా విస్తరించకుండా ఫిలించాంబర్ తగిన కార్యాచరణకు పూనుకోవాలని అన్నారు. అసలు షూటింగ్ స్పాట్ లో ఏమి జరిగిందో వివరించేందుకు అల్లు అర్జున్ ను, గుణశేఖర్ ను రమ్మనమని చెప్పాననీ, అయితే వారు హైదరాబాద్ రావడానికి ఇంకా వ్యవధి పట్టే అవకాశం ఉండటంతో తాను మీడియా ముందుకు వచ్చానని అన్నారు. ఇప్పటికైనా ఇలాంటి ఆందోళనకారులను కె చంద్రశేఖర రావు కట్టడి చేయాలని సూచించారు.


Click it and Unblock the Notifications











