Don't Miss!
- Finance Gold Price: శుభవార్త.. ఆకాశం నుంచి విరిగిపడ్డ బంగారం ధర.. షాపింగ్ షురూ చేసేయండి..
- News పవన్ కల్యాణ్‌కు హ్యాండిచ్చిన కీలక నేత
- Sports లేడీ ఫ్యాన్ అందాన్ని చూసి కంట్రోల్ తప్పిన గిల్ Video
- Technology షియోమీ ప్రత్యేక ఈవెంట్.. బడ్స్ 5A, ప్యాడ్ SE సహా కీలక ఉత్పత్తుల విడుదల.. పూర్తి వివరాలు..!
- Automobiles రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
అల్లు వారి చిచ్చర పిడుగులు.. భలే క్యూట్‌గా ఉన్నారే!
అల్లు వారి పిల్లలు సోషల్ మీడియాలో ఎంతగా హల్చల్ చేస్తుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ కిడ్స్‌లో అర్హ, అయాన్ల ఫాలోయింగ్ సపరేట్. అల్లు అర్జున్ తన పిల్లలతో కలిసి చేసే అల్లరి ఎంతగా వైరల్ అవుతూ ఉంటుందో ఇదివరకు ఎన్నో సార్లు చూశాం. ఈ లాక్ డౌన్ సమయంలో బన్నీ తన పిల్లలతో ఎంతో విలువైన సమయాన్ని గడిపాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు తెగ చక్కర్లు కొట్టాయి.
ఆ మధ్య ఐఫోన్ సిరితో బన్నీ, అయాన్ చేసిన అల్లరి ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ఇక బుగ్గల అర్హతో బన్నీ చేసే పెళ్లి గోల గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిందే. పెళ్లి విషయంలో తండ్రీ కూతుళ్ల మధ్య ఓ సారుపత్య మాత్రం రావడం లేదు. చిన్నదే అయినా సరే నాన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూనే వస్తోంది. బన్నీ షేర్ చేసే ఈ క్యూట్ వీడియోలకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు.
ఇక ఇంట్లో వీరిద్దరు చేసే అల్లరిని ఎప్పటికప్పుడు స్నేహా రెడ్డి షేర్ చేస్తూనే ఉంటుంది. ఇద్దరూ కలిసి ఇంట్లో ఆడుకున్న ఫోటోలు, వీడియోలు నిత్యం అభిమానులకు చేరవేస్తూనే ఉంటుంది. తాజాగా స్నేహ రెడ్డి షేర్ చేసిన ఫోటోలు చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. రెయిన్ కోట్ వేసుకున్న ఇద్దరూ బుడుగులు లాన్లో తెగ సందడి చేస్తోన్నట్టు కనిపిస్తోంది. ఇక రెయిన్ కోట్ ధరించడం ఆ ఇద్దరు చిచ్చర పిడుగులు చూడచక్కగా ఉన్నారు. ఈ ఫోటోలను చూసిన అల్లు శిరీష్ సైతం క్యూట్ అంటూ సంబర పడిపోయాడు.