For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అమ్మాయిలంతా అల్లు అర్జున్ వెనుకే...(వీడియో)

  By Srikanya
  |

  హైదరాబాద్ : అల్లు అర్జున్ కొత్తగా హీరో గ్లామర్ 125cc బైక్ కు బ్రాండ్ సైన్ చేసారు. ఈ మేరకు ఆయన ఓ సూపర్ కూల్ కమర్షియల్ యాడ్ చేసారు. ఈ యాడ్ లో అల్లు అర్జున్ వెనక ఎక్కడెక్కడ అమ్మాయిలూ పడుతూంటారు. సౌత్ ఇండియాలో అల్లు అర్జున్ కు మార్కెట్ పెరుగుతూండటంతో పెద్ద సంస్దలు తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా అల్లు అర్జున్ ని ఎంపిక చేసుకుంటున్నారు. ఇక ఈ యాడ్ లో అల్లు అర్జున్ ని చూడండి.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  https://www.facebook.com/TeluguFilmibeat

  అల్లు అర్జున్ ...తాజా చిత్రాల విషయానికి వస్తే...

  తొలి నుంచి తనదైన శైలిలో మాస్‌ కథల్ని తెరకెక్కించడంలో ప్రత్యేకత చూపుతూ హిట్స్ కొట్టడం బోయపాటి శ్రీను శైలి ప్రత్యేకం. 'భద్ర', 'తులసి', 'సింహా' చిత్రాలతో హిట్ చిత్రాల దర్శకుడయ్యారు. గతేడాది 'లెజెండ్‌'తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకొన్నారాయన. దాంతో అల్లు అర్జున్‌తో సినిమా చేసేందుకు కథను సిద్ధం చేసుకొన్నారు. ఆ చిత్రం త్వరలో పట్టాలెక్కనున్నట్లు సమాచారం.

  ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు బన్ని. ఆ చిత్రం తర్వాత బోయపాటి శ్రీను సినిమా కోసం బరిలోకి దిగాలని బన్ని నిర్ణయించుకొన్నారని తెలిసింది. గీతా ఆర్ట్స్‌ సంస్థలో తెరకెక్కనున్న ఆ చిత్రానికి తమన్‌ స్వరాలు సమకూరుస్తారు.

  Allu Arjun in 2015 Hero Glamour 125cc commercial

  అల్లు అర్జున్‌ను తెరపై 'జులాయి'గా చూపించి ప్రేక్షకులకు వినోదాలు పంచారు త్రివిక్రమ్‌. ఆ ఇద్దరి కలయికలో ఇప్పుడు మరో చిత్రం తెరకెక్కుతోంది. సమంత, నిత్యమేనన్‌, ఆదాశర్మ హీరోయిన్స్. రాధాకృష్ణ నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాకు 'సన్నాఫ్‌ సత్యమూర్తి' అనే పేరు ఖరారు చేసినట్టు సమాచారం.

  త్రిశూలం, హుషారు, జాదూగర్ వంటి టైటిల్స్ పరిశీలనలకో వచ్చినా కథ ప్రకారం ఇదే సరైన టైటిల్ అని దర్శకుడు, హీరో భావించినట్లు సమాచారం. మార్చి చివరలో కాని,ఏప్రియల్ మొదటి వారంలో కానీ ఈ చిత్రం విడుదల అవనుంది. ఈ టైటిల్ ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా పడుతుందని చెప్తున్నారు. తండ్రి కొడుకుల రిలేషన్ కూడా కథలో ప్రధానంగా సాగుతుందని అంటున్నారు.

  వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ వెడ్డింగ్‌ ప్లానర్‌గా కనిపించనున్నారు. బన్నీ సృష్టించే పెళ్లి సందడి.. వినోదాలు పంచనుంది. ఈ చిత్రం కోసం హైదరాబాద్‌ శివార్లలో ప్రత్యేకంగా ఓ సెట్‌ వేశారు. కీలకభాగం చిత్రీకరణ అక్కడే జరిగింది.

  ఇందులో అల్లు అర్జున్‌ వెడ్డింగ్‌ ప్లానర్‌గా కనిపిస్తాడనీ, సినిమా అంతా పెళ్లి సందడి మధ్య సాగుతుందని తెలుస్తోంది. రాజేంద్రప్రసాద్‌, ఉపేంద్ర, స్నేహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వేసవికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

  మరో ప్రక్క ఈ చిత్రం పూర్తవగానే మహేష్ ,త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో ఓ చిత్రం ప్రారంభం కానుంది. జూలాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల నిర్మాత రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 2015 ఆగస్టు నుంచి ఈ కొత్త ప్రాజెక్టు పట్టాలు ఎక్కవచ్చు. ఈ మేరకు ఎగ్రిమెంట్ జరిగినట్లు తెలుస్తోంది. అప్పటికి మహేష్ బాబు తన తాజా చిత్రాన్ని ఫినిష్ చేసుకుని రెడీ అవుతారు.

  English summary
  Allu Arjun has been signed as the brand ambassador of Hero Glamour 125cc. Watch the supper cool commercial of this newly introduced Two-Wheeler and what made is special is the sheer presence of Stylish Star.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X