బ్రేకింగ్: అల్లు అర్జున్-సుకుమార్ మూవీ అనౌన్స్‌మెంట్
Recommended Video

'నా పేరు సూర్య' ఫలితం నిరాశ పరచడంతో తన తర్వాతి సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చాలా గ్యాప్ తీసుకున్నారు. అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ న్యూ ఇయర్ సందర్భంగా తన 19వ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా ఇంకా పట్టాలెక్కకముందే అందరికీ ఆశ్చర్య పరుస్తూ అల్లు అర్జున్ 20వ సినిమా కూడా ప్రకటించారు. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా చేయబోతున్నట్లు అఫీషియల్‌గా వెల్లడించారు. ఈ ఊహించని ప్రకటనతో అభిమానులు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో
ఇంతకు ముందు సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం' లాంటి భారీ బ్లాక్ బస్టర్ మూవీ నిర్మించిన ‘మైత్రి మూవీ మేకర్స్' వారు అల్లు అర్జున్-సుకుమార్ మూవీ నిర్మించబోతున్నారు. త్వరలో ఈ మూవీకికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

బన్నీ-సుకుమార్ 3వ సినిమా
అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేసన్లో గతంలో ‘ఆర్య', ‘ఆర్య 2' చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. కెరీర్ ప్రారంభంలో బన్నీని స్టార్ హీరో రేంజికి తీసుకెళ్లిన చిత్రం ‘ఆర్య'. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుండటంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సుకుమార్-మహేష్ ప్రాజెక్ట్ లేనట్లేనా?
‘రంగస్థలం' తర్వాత సుకుమార్-మైత్రి మూవీ మేకర్స్.. మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే వారు ఇపుడు బన్నీ సినిమాకు షిప్ట్ అవ్వడంతో... మహేష్ బాబు మూవీ ఇప్పట్లో లేనట్లే అని స్పష్టమవుతోంది.

ఈ నెలలోనే త్రివిక్రమ్ మూవీ ప్రారంభం
మరో వైపు అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్లో ప్రారంభం కాబోయే చిత్రం మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్ మొదటి వారంలో లాంచ్ చేసేందు ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన వెంటనే బన్నీ-సుకుమార్ మూవీ ప్రారంభం అవుతుందని టాక్.


Click it and Unblock the Notifications











