ఎన్నేళ్ళైనా తిరుగులేని సినిమా.. ఆ మ్యాజిక్ అద్భుతం అంటున్న బన్నీ, ఎవరి సినిమానో తెలుసా!

స్టైలిష్ సార్ అల్లు అర్జున్ చివరగా నటించిన చిత్రం నా పేరు సూర్య. ఈ చిత్రం బన్నీ ఫ్యాన్స్‌ని అంతగా సంతృప్తి పరచలేదు. దీనితో ఈ సారి ఓ అద్భుతమైన చిత్రంతో ఆడియన్స్ ముందుకు రావాలని బన్నీ ప్రత్నిస్తున్నాడు. చాలా రోజులుగా బన్నీ కొత్త చిత్రానికి సంబంధించి కసరత్తు జరుగుతూనే ఉంది. ఎట్టకేలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చిత్రం జనవరి నుంచి ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ గ్యాప్‌లో బన్నీ ఎక్కువ సమయాన్ని తన కుటుంబ సభ్యులకు కేటాయిస్తున్నాడు. సరదాగా గడుపుతున్నాడు. తాజాగా అల్లు అర్జున్ 90లలో ఒక ఊపు ఊపిన ఓ చిత్రం గురించి ఆసక్తికర పోస్ట్ పెట్టాడు.

ప్రేమ కథలలో సరికొత్త ట్రెండ్

ప్రేమ కథలలో సరికొత్త ట్రెండ్

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, అందాల తార కాజోల్ జంటగా నటించిన దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే చిత్రం ప్రేమ కథ చిత్రాల్లో కొత్త ట్రెండ్ సృష్టించింది. 1995లో విడుదలైన ఈ చిత్రం ఓ క్లాసిక్. ఆదిత్య చోప్రా దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఒక అద్భుతం అని చెప్పొచ్చు. కాస్త తీరిక సమయం దొరికిందో ఏమో కానీ బన్నీ ఈ చిత్రాన్ని మరోమారు చూశాడు. ఈ చిత్ర అనుభూతుల నుంచి బయటకు వచ్చేలోపే ఇంస్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు.

ఇప్పటికి అదే మ్యాజిక్

ఇప్పటికి అదే మ్యాజిక్

అల్లు అర్జున్ ఈ చిత్రం గురించి కామెంట్ చేస్తూ.. తొలిసారి ఈ చిత్రాన్ని 1995లో చూశా. ఆ సమయంలో అద్భుతమైన సినిమాటిక్ మ్యాజిక్‌ని, అనుభూతిని అనుభవించా. మళ్లీ ఇప్పుడు 23 ఏళ్ల తరువాత ఈ చిత్రాన్ని చూశా. అదే మ్యాజిక్.. అదే అనుభూతి కలిగిందని బన్నీ తెలిపాడు. అప్పుడు.. ఇప్పుడూ.. ఇంక ఎన్నేళ్ళైనా ఈ చిత్రానికి తిరుగులేదని అల్లు అర్జున్ తెలిపాడు. నా హృదయం మొత్తం ఈ చిత్రంపై ప్రేమతో నిండిపోయిందని వ్యాఖ్యానించాడు.

యువతలో క్రేజ్

యువతలో క్రేజ్

భాషతో సంబంధం లేకుండా ఈ చిత్రం దేశంలోని యువతీ యువకులందరిని ఆకర్షించింది. షారుఖ్, కాజల్ ఏ వేదికపై కలసినా ఈ సినిమాని గుర్తు చేసుకోకుండా ఉండలేరు. షారుఖ్, కాజోల్ మధ్య మంచి స్నేహానికి కూడా ఈ చిత్రం కారణం అయింది. ఈ చిత్రం క్లైమాక్స్‌లో వచ్చే ట్రైన్ సన్నివేశంపై లెక్కలేనన్ని పేరడీలు వచ్చాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

హ్యాట్రిక్ మూవీ

హ్యాట్రిక్ మూవీ

ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. నా పేరు సూర్య చిత్రం తరువాత బన్నీ విక్రమ్ కుమార్ దర్శత్వంలో నటిస్తాడని ప్రచారం జరిగింది. కానీ కథ పూర్తిగా నచ్చకపోవడంతో బన్నీ ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశాడు. తనకు అచ్చొచ్చిన దర్శకుడు త్రివిక్రమ్ సీన్‌లోకి ఎంటర్ కావడం ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ మూవీకి సిద్ధం అయినట్లు తెలుస్తోంది. జనవరి నుంచి ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకుని వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X