Just In
- 1 hr ago
విజయ్ దేవరకొండ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్: అందరూ అనుకున్న టైటిల్‌నే ఫిక్స్ చేశారు
- 2 hrs ago
టాలీవుడ్లో విషాదం: ప్రముఖ నిర్మాత కన్నుమూత.. సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ వరకు!
- 2 hrs ago
రాజమౌళి - మహేశ్ మూవీ నుంచి షాకింగ్ న్యూస్: ఎవరూ ఊహించని పాత్రలో సూపర్ స్టార్
- 3 hrs ago
టబుకు సోషల్ మీడియాలో చేదు అనుభవం: ఆ లింకుల గురించి హెచ్చరిస్తూ హీరోయిన్ ఆవేదన!
Don't Miss!
- Sports
చెలరేగిన సిరాజ్, శార్దూల్.. ఆసీస్ ఆలౌట్! టీమిండియా టార్గెట్ 328!
- Automobiles
టాటా ఆల్ట్రోజ్ ఐటర్బో పెర్ఫార్మెన్స్ను చూపించే కొత్త టీజర్ విడుదల
- News
కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాక వార్డ్ బాయ్ మృతి .. టీకాతో సంబంధం లేదన్న ఆస్పత్రి అధికారి
- Finance
నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే? ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7400 తక్కువ
- Lifestyle
మీ చక్కెర స్థాయిని అదుపులో ఉంచడానికి ప్రతి ఉదయం దీన్ని తాగితే సరిపోతుంది ...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఫస్ట్ టైం అలా చూశా.. రాత్రి రెండు గంటలకు కూడా.. స్నేహారెడ్డిపై బన్నీ కామెంట్స్
అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల ప్రేమకథ చాలా మందికి తెలియదు. వారిద్దరి ప్రేమ వివాహామని కూడా కొందరికి తెలియదు. ఆ మధ్య అర్హతో బన్నీ పెళ్లి ముచ్చట్లు పెట్టడం, వాటికి స్నేహా రెడ్డి కౌంటర్లు వేయడం అందరికీ గుర్తుండే ఉంటుంది. నాన్న చెప్పిన అబ్బాయినే చేసుకో అంటూ అర్హ చేత బలవంతంగా చెప్పించాలని బన్నీ చెప్పడం, అర్హ అడ్డంగా తలూపడం అందరికీ తెలిసిందే. నువ్ మాత్రం మీ నాన్న చెప్పిన అమ్మాయిని చేసుకున్నావా? అంటూ స్నేహారెడ్డి బన్నీకి షాక్ ఇవ్వడం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా బన్నీ తన శ్రీమతి గురించి ఎంతో గొప్పగా చెప్పాడు.

సామ్ జామ్ షోలో..
సమంత ఆహా యాప్ కోసం సామ్ జామ్ షో చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో ఇప్పటికే ఎంతో మంది తారలను ఇంటర్వ్యూ చేసింది. క్రిస్మస్ సందర్భంగా చిరంజీవితో చేసిన ఇంటర్వ్యూను ప్రసారం చేశారు. ఇక న్యూ ఇయర్ సందర్భంగా అల్లు అర్జున్‌తో చేసిన ఇంటర్వ్యూను అందుబాటులోకి తెచ్చారు.

ఎన్నెన్నో విషయాలు..
సమంత అడిగిన ఎన్నో ప్రశ్నలకు బన్నీ సమాధానాలు చెప్పాడు. ఆ క్రమంలో బన్నీ తన వ్యక్తిగత విషయాలు, కుటుంబ సంగతులు, చిన్ననాటి అల్లరి పనులు ఇలా ఎన్నింటి గురించో చెప్పాడు. తన పిల్లలపై ప్రేమ, భార్యపై ఉన్న ప్రేమను బయట పెట్టేశాడు.

అయాన్ అంటేనే ఇష్టం..
అయాన్ గురించి బన్నీ మాట్లాడుతూ.. నాకు అయాన్ అంటేనే ఇష్టం.. అయాన్‌తోనే ఎక్కువగా ఉంటాను.. కానీ అయాన్‌కు కెమెరాలన్నా, ఫోటోలు తీయడమన్నా నచ్చదు. కానీ అర్హ మాత్రం వెంటనే వచ్చేస్తుంది.. అందుకే అన్ని ఫోటోలు అర్హతోనే ఉంటాయి.. అందరూ అర్హ అంటేనే ఇష్టమని అనుకుంటారు.. కానీ అయాన్ అంటేనే ఇష్టమని చెప్పుకొచ్చాడు.

నచ్చింది అదే...
అల్లు స్నేహారెడ్డిలో మీకు నచ్చింది ఏమిటి అని సమంత బన్నీని అడిగింది. ఆమెలో డిగ్నిటీ నాకు చాలా నచ్చిందంటూ బన్నీ ఓ విషయాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. నేను మొదటి సారిగా స్నేహాను నైట్ క్లబ్ పార్టీలో చూశాను అంటూ మొదటి చూపుల గురించి చెప్పాడు.

ఆ సమయంలోనూ అలా..
నైట్ క్లబ్ పార్టీలో చూశాను.. అంత మందిలోనూ ఎంతో డిగ్నిటీగా కనిపించింది.. రాత్రి రెండు అవుతున్నా కూడా అంతే పద్దతిగా కనిపించింది.. ఏ మాత్రం అసభ్యకరంగా కనిపించలేదు.. తనలో నాకు అదే నచ్చింది అంటూ స్నేహారెడ్డి గురించి బన్నీ చెప్పుకొచ్చాడు.