వాళ్లకోసం సినిమాలు చేయట్లేదు: అల్లు అర్జున్
హైదరాబాద్: ఏ కమర్షియల్ హిట్ సినిమాలోనైనా ఆరు సాంగులు, నాలుగు ఫైట్లు, ఓ ఐటం సాంగు కామన్‌గా ఉంటాయి. అల్లు అర్జున్ హిట్ సినిమాలన్నీ ఇలాంటి రొటీన్ మసాలాతో రూపొందినవే. ఈ విషయమై అల్లు అర్జున్ మాట్లాడుతూ..జనరల్ ఆడియన్స్ ఇలాంటి కావాలనే కోరుకుంటారు. బాలీవుడ్ అయినా, కోలీవుడ్ అయనా, టాలీవుడ్ అయినా అందరి టేస్టు దాదాపుగా సమానమే అన్నారు.
నేను క్రిటిక్స్ కోసం సినిమా చేయను. వారి ఆలోచనల ప్రకారం చేస్తే బిజినెస్ చేయలేం. వేదం సినిమాలో నేను చేసిన పాత్రకు క్రిటిక్స్ నుంచి మంచి మార్కులు వచ్చినప్పటికీ ఆ చిత్రం బాక్సాఫీసు వద్ద కమర్షియల్‌గా హిట్ కాలేక పోయింది. నేను ఎంటర్ టైన్మెంట్ పంచే సినిమాలు చేయడానికే ఇష్ట పడతాను. డ్రామా, కామెడీ, నృత్యాలు, పోరాటాలు, శృంగారం, పాటలు లాంటి రొటీన్ మసాలా మిక్స్ చేస్తూ సినిమా కొత్తగా, డిఫరెంటుగా చూపించడం ఎంతో కష్టంతో కూడుకున్నది అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు.
ఈ చిత్రం తర్వాత అల్లు అర్జున్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఈచిత్రానికి 'ఇద్దరమ్మాయిలతో' అనే టైటిల్ అనుకుంటున్నారు. బండ్ల గణేష్ రూపొందించే ఈ చిత్రం బారీగా రూపొందనుంది. హీరోయిన్స్ సెంట్రల్ గా నడిచే కధ కాబట్టి ఆ టైటిల్ పెట్టనున్నారని తెలుస్తోంది.
కథ తనకి కొత్తదని, తన కెరీర్ లో ఇలాంటి కథను టచ్ చేయలేదని, తన ఫ్యాన్స్ ని గ్యారెంటీగా అలరిస్తుందని అని అల్లు అర్జున్ తన సన్నిహితులుతో వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బన్నీకోసం పూరి రాసిన డైలాగులు బి జినెస్ మ్యాన్ రేంజిలో పేలుతాయనే భరోసాతో ఓకే చేసినట్లు చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











