అల్లు అర్జున్... 'బూచోడోయ్...'

చీకట్లోంచి హీరో పరిగెత్తుతూ వస్తుంటాడు. టైటిల్‌లో రేసుకి సిద్ధంగా ఉన్న గుర్రం తల, అల్లు అర్జున్ కనిపించేలా పెట్టారు. పాత్ర ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి అంటూ ప్రేక్షకులకు రుచి చూపించివిడిచిపెట్టారు. దాంతో ఇప్పుడు అంతటా 'బూచోడోయ్...' అని ఎందుకు అన్నారు అనేదే హాట్ టాపిక్ గా మారింది. దానికి తోడు గతంలో ఈ చిత్రానికి బూచోడు అనే టైటిల్ పెడతారనే ప్రచారమూ జరిగింది.
ఈ చిత్రం గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ... పోటీకి సిద్ధమైన కుర్రాడు ఎలా ఉంటాడు... చీకట్లను చీల్చుకుంటూ, ప్రత్యర్థుల కళ్లలో భయాన్ని పెంచుతూ, కదన రంగంలోకి దిగుతున్న సైనికుడిలా ఉంటాడు. ఇంకా చెప్పాలంటే మా సినిమాలో హీరోలా ఉంటాడు అంటున్నారు . నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), కె.వెంకటేశ్వరరావు నిర్మాతలు. యాక్షన్, ప్రేమ, వినోదాల్ని మేళవించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.
సురేంద్రరెడ్డి మాట్లాడుతూ... "పరుగు పందెంలో గెలవడం రేసుగుర్రం విధి. జీవితమనే పరుగు పందెంలో గెలవడం మనిషి విధి. అయితే... ఈ రేసులో అడపాదడపా గెలిచేవారు కొందరైతే... గెలుపుని ఇంటిపేరుగా మార్చుకున్నవాళ్లు కొందరు. ఆ కొందరిలో ఒకడి కథే... 'రేసుగుర్రం. బాధ్యతాయుతమైన ఓ యువకుని కథాంశంతో సురేందర్‌రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ శక్తిమంతమైన పాత్ర పోషిస్తున్నారు" అన్నారు.
కోట శ్రీనివాసరావు, సుహాసిని మణిరత్నం, ప్రకాష్‌రాజ్, అలీ, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, ముఖేష్‌రుషి, ఆశిష్ విద్యార్థి, నవాజ్ సోనూ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: వక్కంతం వంశీ, కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: ఎస్.తమన్, కూర్పు: గౌతంరాజు, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు, నిర్మాణం: శ్రీలక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్.


Click it and Unblock the Notifications











