Just In
- 21 min ago
అది మాత్రం కంపల్సరీ అంటూ... గోవాలో రాశీ ఖన్నా రచ్చ
- 45 min ago
మరో నిర్మాత కొడుకును హీరోగా పరిచయం చేస్తున్న శ్రీకాంత్ అడ్డాల.. నారప్ప తరువాత అదే..
- 50 min ago
‘పుష్ప’ విషయంలో అల్లు అర్జున్ నిర్ణయం మార్పు: సినిమా విడుదల అయ్యేది ఐదు భాషల్లో కాదు!
- 57 min ago
రొమాన్స్‌లో మునిగితేలారు.. అది అలవాటుగా కాదట.. భర్త ఒళ్లో వాలిన పూజా రామచంద్రన్
Don't Miss!
- News
అనంత కలెక్టర్‌ను కదిలించిన ఫేస్బుక్ పోస్ట్: 24 గంటల్లోనే బస్సు: స్టూడెంట్స్‌తో కలిసి ప్రయాణం
- Finance
బడ్జెట్ కంటే ముందు ఏ స్టాక్స్ కొంటే లాభాలు వస్తాయి..?
- Sports
టీమిండియా సాధించిన చరిత్రాత్మక విజయాన్ని స్ఫూర్తిగా పొందండి: మోదీ
- Automobiles
సూపర్‌బైక్ రైడర్ని వేధించిన స్థానికులు మరియు పోలీసులు - వీడియో
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అన్నపూర్ణలో అలాంటి ఘటన.. అందుకే అల్లు స్టూడియో.. నోరు విప్పిన బన్నీ
అల్లు అర్జున్ ప్రస్తుతం సమంత సామ్ జామ్‌లో సందడి చేశాడు. నూతన సంవత్సరం సందర్భంగా ఆహా యాప్‌లో బన్నీ సమంత ముచ్చట్లు పెట్టుకున్న ఎపిసోడ్‌ను అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం బన్నీ చెప్పిన విశేషాలు, విషయాలు వైరల్ అవుతున్నాయి. 2020 అనేది అల్లు కుటుంబానికి ఎంత కలిసి వచ్చిందో చెప్పాడు. అంతే కాకుండా అల్లు స్టూడియో ఏర్పాటు వెనుకున్న కారణం కూడా చెప్పాడు.

2020 స్పెషల్..
2020 అందరికీ బ్యాడ్‌గా గడిచినా కూడా మీకు మాత్రం సూపర్‌గా కలిసి వచ్చింది కదా అని బన్నీని అడిగేసింది సమంత. అల వైకుంఠపురములో, బుట్టబొమ్మ, మోస్ట్ సర్చ్డ్ టాలీవుడ్ యాక్టర్, అల్లు స్టూడియో ఇలా ఎన్నో రకాలు కలిసి వచ్చింది కదా? అని సమంత బన్నీ పొగిడేసింది.

2020 కలిసి వచ్చింది..
2020 అందరికీ ఎలా ఉన్నా కూడా తమకు మాత్రం ఎంతో కలిసి వచ్చిందని అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. ఏడాది ప్రారంభంలోనే అల వైకుంఠపురములో లాంటి సూపర్ హిట్ వచ్చింది అని బన్నీ చెప్పుకొచ్చాడు. సూపర్ హిట్టా? అని సమంత వెరైటీగా అడిగింది. సారీ సారీ బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్ అంటూ బన్నీ కవర్ చేసేశాడు.

డేవిడ్ వార్నర్ వల్లే..
బుట్టబొమ్మ పాట గురించి బన్నీ మాట్లాడుతూ.. ఆ పాట అంతలా ఫేమస్ అవ్వడానికి సగం కారణం డేవిడ్ వార్నరే అని సరదాగా నవ్వేశాడు. మొన్నా మధ్య మ్యాచ్‌లో కూడా బుట్టబొమ్మ స్టెప్పులేశాడంటూ బన్నీ చెప్పుకొచ్చాడు. మొత్తానికి బుట్టబొమ్మ మాత్రం అన్ని పాటల కంటే ఎక్కువగా హిట్ అయిందని అన్నాడు.

అన్నపూర్ణలో అలా..
అల్లు స్టూడియో కట్టాలని ఎందుకు అనిపించింది అని సమంత అడిగింది. మీకు కూడా స్టూడియోలు ఉన్నాయ్ కదా.. ఓ సారి అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్‌లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటే.. వెల్కమ్ సర్ అన్నపూర్ణ స్టూడియో అని అన్నారు.. అప్పుడు మాక్కూడా ఓ స్టూడియో ఉంటే బాగుండు కదా అనిపించిందని బన్నీ తెలిపాడు.

సినిమా ఉన్నంత కాలం..
నేను ఉన్నంత కాలం సినిమాలు చేస్తాను.. సినిమాలు ఉన్నంత కాలం స్టూడియోలు కావాలి.. అందుకే లైఫ్ లాంగ్ ఉండే సినిమా స్టూడియో నిర్మించాలని అనుకున్నాం.. అది మాకోసమే కాదు.. ఇండస్ట్రీ అంతటి కోసం.. అన్ని సినిమాలు సౌకర్యకరంగా షూటింగ్ చేసుకునేలా ఉండాలని అనుకుంటున్నానని బన్నీ చెప్పుకొచ్చాడు.