చిరంజీవిగారొచ్చి డ్యాన్స్ చేయరు : అల్లు అర్జున్
హైదరాబాద్ : చిరంజీవి, అల్లు అరవింద్.. అనే పేర్లు థియేటర్ వరకే. లోపల లైట్లన్నీ ఆర్పేశాక.. మెప్పించాల్సింది మేమే. నా కోసం చిరంజీవిగారొచ్చి డ్యాన్స్ చేయరు. డాడీ వచ్చి నటించరు. అంతా మేమే చూసుకోవాలి. కానీ.. ఆ పేర్లు బ్రాండ్. ఓ సబ్బు కొనడానికి బజారుకెళ్తాం. మన చూపు పేరున్న కంపెనీపై పడుతుంది. సరేలే ట్రై చేద్దాం అనుకొంటారు. మేం కూడా అంతే అన్నారు అల్లు అర్జున్. అల్లు అర్జున్ సోదరడు శిరీష్ 'గౌరవం'తో హీరో గా తెరపైకి వస్తున్నారు...ఈ సందర్భంగా బన్నీ మీడియాతో మాట్లాడారు.
అలాగే కాస్త ఆలస్యమైనా సొంత శైలి ఏర్పరచుకోవాలి అని చెప్తూ... చిరంజీవిగారిని పవన్‌కల్యాణ్ ఎప్పుడూ అనుకరించలేదు. చరణ్ కూడా తన సొంత దారిలోనే వెళ్తున్నాడు. నటుడికి కావల్సింది అదే అన్నారు. తమ్ముడు హీరో కాబోతున్న ఫీల్ ఎలా గురించి చెప్తూ...
ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. అసలు తను హీరో అవుతాడని నేనే కాదు, ఇంట్లోవాళ్లెవరూ ఊహించలేదు. శిరీష్ హీరో అవ్వడం మా ఇంటిల్లిపాదికీ పెద్ద షాక్ అని ఈ మధ్య చరణ్ కూడా అన్నారు. అంతకు మించిన షాక్‌కి నేను లోనయ్యాను అని చెప్పుకొచ్చారు.
ఇక ఇక్కడ ఎవరూ ఎవరికీ పోటీ కాదండీ.... మనకు మనమే పోటీ. ఎవరి సినిమా బాగుంటే వాళ్లను చూస్తారు. అందరం పక్కపక్కనే పరిగెడుతున్నాం కాబట్టి అందరూ పోటీ అనుకుంటున్నారు. కానీ అది పొరపాటు. ఇక్కడ ఎవరి పరుగు వారిది. ఎవరి జీవితం వారిది. పదేళ్ళలో నేను సాధించింది నాలుగేళ్లలో సాధించగల ప్రజ్ఞావంతుడు శిరీష్. మూర్ఖత్వంతో ఏ నిర్ణయం తీసుకోడు. అందుకే తప్పకుండా సక్సెస్ అవుతాడని నా నమ్మకం అని తన సోదరుడు విజయంపై విశ్వాసం వ్యక్తం చేసారు.


Click it and Unblock the Notifications











