తన కొడుకు కారణం కాదంటున్న అల్లు అర్జున్
హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘రేసు గుర్రం' చిత్రం 2014 సంవత్సరంలో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా రికార్డుల కెక్కింది. తన కొడుకు అయాన్ పుట్టిన వేళా విశేషం తన జీవితం పూర్తిగా మారి పోయిందని అంటూ ఆనంద పడిపోతున్నాడు మన బన్నీ. సినిమా విజయానికి తన కొడుకును కారణంగా చూపను అంటున్నాడు.
దర్శకుడు సురేందర్ రెడ్డి ఆయన ఏడాది కష్టం, టీం సమిష్టి కృషి మూలంగానే ఈచిత్రం భారీ విజయం సాధించిందని అల్లు అర్జున్ స్పష్టం చేసాడు. అయాన్ పుట్టిన తర్వాత జీవితం చాలా కొత్తగా ఉంది, ఎంతో ఆనందంగా, బెటర్‌గా ఉంది. తండ్రయిన తర్వాత ఆనందాన్ని దేనితో వెల కట్టలేం. ఆ అనిభూతి ఎలా ఉంటుందో తండ్రి అయిన వారికే తెలుస్తుంది అంటున్నాడు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కొడుకుకు తొలిసారి విదేశీ యాత్రకు తీసుకెలుతున్నాడు. అది కూడా చీకటి ఖండానికి. చీకటి ఖండం అంటే మరేదో అనుకోవద్దు సుమీ. కొడుకుతో కలిసి సౌతాఫ్రికా వెలుతున్నాడు. 19వ శతాబ్దం చివరి వరకూ ఆఫ్రికా ఖండం గురించి పెద్దగా తెలియకపోవడం వల్ల ఐరోపావాసులు దాన్ని చీకటి ఖండం అని పిలిచేవారు.
న్యూ ఇయర్ వేడుకలను తన భార్య స్నేహా రెడ్డి, తనయుడు అయాన్ తో కలిసి సౌతాఫ్రికాలో ప్లాన్ చేసుకున్నాడు అల్లు అర్జున్. జనవరి రెండో వారంలో ఇండియా తిరిగి వస్తారని అంటున్నారు. అల్లు అర్జున్ దంపతులు తన కొడుకును అల్లారుముద్దుగా పెంచుతున్నారు. అఫ్ కోర్స్ ఏ తల్లిదండ్రులకు తమ బిడ్డలంటే ఎనలేని ప్రేమ ఉండటం సహజమే.


Click it and Unblock the Notifications











