మాస్టారు అదరగొట్టారు : అల్లు అర్జున్

ఫైట్ మాస్టార్ పనితనం గురించి అల్లు అర్జున్ తన సోషల్ నెట్వర్కింగులో వెల్లడిస్తూ.....'కేచ మాస్టార్ ఫైట్స్ అద్భుతంగా కంపోజ్ చేస్తున్నాడని, అతని పనితనం ఏమిటో సినిమాలో చూడండి' అంటూ వెల్లడించారు. అల్లు అర్జున్ వ్యాఖ్యాలు సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెరిగేలా చేసింది.
'ఇద్దరమ్మాయిలతో' సినిమా కోసం అల్లు అర్జున్ కండలు బాగానే పెంచాడు. ఈ సినిమాలో మరి 'ఇద్దరమ్మాయిలతో' ప్రేమలో పడాలి కాబట్టి, వాళ్లని ఆకర్షిచాలంటే, మరి కండలు తిరిగిన బాడీ వుండాలి కదా ! అందుకే, అందుకు తగ్గట్టుగానే ఇందులో కొత్తగా కనిపిస్తున్నాడు. ఇందులో అమలాపాల్, కేథరీన్ కథానాయికలుగా నటిస్తున్నారు. అల్లు అర్జున్ అభిమాన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు.
పూరి చిత్రం గురించి చెబుతూ ''ఇదో ప్రేమ కథా చిత్రం. బన్నీ అంటేనే ఎనర్జీ. తనే కాదు సెట్‌లో అందర్నీ ఉత్సాహంగా ఉరకలేయిస్తారు. ఈ కథను అల్లు అరవింద్‌కు చెప్పినపుడు మావాడికి బాగుంటుందని చెప్పారు. తెలుగులో తొలి సిక్స్ ప్యాక్ హీరో. ఈ సినిమా కథను బన్నీకి చెప్పినప్పుడు.. మనమే చేద్దాం అన్నాడు. ఆ తర్వాత అరవింద్‌గార్ని కలిసినప్పుడు 'బన్నీకి ఒక కథ చెప్పావట.. అది తనతోనే చెయ్యి. తనకు బాగా నచ్చింది' అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, నృత్యాలు: దినేష్, కళ: చిన్నా, కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: దేవిశ్రీప్రసాద్. కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్‌వర్మ.


Click it and Unblock the Notifications











