తమన్ ఇరగదీసాడంటున్న అల్లు అర్జున్
ఫేస్‌బుక్‌లో అల్లు అర్జున్ స్పందిస్తూ...'రేస్ గుర్రం చిత్రం కోసం తమన్ ఎక్సలెంట్ సాంగ్స్ ఇచ్చాడు. సినిమా ఆడియో విడుదల ఎప్పుడు జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. పాటలు సూపర్ హిట్టవడం ఖాయం' అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు అల్లు అర్జున్.
కిక్‌తో హిట్ కొట్టి స్టార్ దర్శకుడిగా మారిన సురేందర్ రెడ్డి, ఆ తర్వాత ఊసరవెల్లితో బోల్తా పడ్డాడు. అయితే ఈచిత్రంతో ఎలాగైనా హిట్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ బైక్ రేసర్‌గా కనిపించనున్నారని తెలుస్తోంది. బన్నీ ఆ సీన్స్ కోసం బైక్ రేస్ ట్రైనింగ్ అయ్యినట్లు తెలుస్తోంది.
రేస్ గుర్రం చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి, కె. వెంకటేశ్వరరావు సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ : వక్కతం వంశీ, సంగీతం : తమన్, సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, ఎడిటింగ్ : గౌతం రాజు, నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్, వెంకటేశ్వర రావు, దర్శకత్వం : సురేందర్ రెడ్డి.


Click it and Unblock the Notifications
