Don't Miss!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Sports ఆ చెత్త నిర్ణయమే ఆర్సీబీ కొంపముంచింది- ఫించ్
- News ముందస్తుగానే ఏపీ ఎన్నికల ఫలితాలు - గెలుపెవరిది..!!
- Finance Debt Free: అప్పుల ఊబి నుంచి త్వరగా బయటపడాలా..?? ఇవిగో 5 మార్గాలు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
ఏ ఒక్కరినీ విస్మరించలేదు.. ‘ఉప్పెన’పై అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ రివ్యూ
ఉప్పెన సినిమా విడుదలై దాదాపు నాలుగు వారాలు అవుతున్నా కూడా దాని ప్రభంజనం మాత్రం తగ్గడం లేదు. ఇంకా కలెక్షన్లలో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది. ఇప్పటికే డెబ్బై కోట్ల గ్రాస్ దాటేసింది. పెట్టిన పెట్టుబడికి రెండింతలు వచ్చేసింది. అయితే తాజాగా మరోసారి ఉప్పెన సినిమా మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. రీసెంట్గా ఉప్పెన సినిమాను వీక్షించిన అల్లు అర్జున్ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.
ఆల్రెడీ బ్లాక్ బస్టర్..
ఉప్పెన సినిమా ఇప్పటికే బ్లాక్ బస్టర్ అయింది. లెక్కల పరంగా చూసుకుంటే అంతకు మించి అనేలా వసూళ్లను రాబడుతోంది. మూడు రోజుల్లోనే పెట్టిన పెట్టుబడిని తీసుకొచ్చింది. రెండింతల లాభాలతో దూసుకుపోతోన్న ఉప్పెనను తాజాగా బన్నీ వీక్షించాడు.
అందుకే ఆలస్యం..
మామూలుగా ఏదైనా ఓ సినిమాకు మంచి టాక్ వస్తే.. వెంటనే చూసేసి అభినందిస్తుంటాడు బన్నీ. అయితే పుష్ప షూటింగ్ వల్ల ఉప్పెన సినిమాను ఆలస్యంగా వీక్షించాడు. నిన్న రాత్రి సినిమాను చూసిన బన్నీ తాజాగా తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
విజయ్ సేతుపతి..
ఉప్పెన సినిమాను చూశాను.. ఇలాంటి సినిమాను తీసినందుకు బుచ్చిబాబు అంటే గౌరవం ఏర్పడింది.. డీఓపీ, టెక్నికల్ టీం అద్భుతంగా పని చేసింది.. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రాణం.. విజయ్ సేతుపతి ఆయన నటనతో ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లారంటూ బన్నీ చెప్పుకొచ్చాడు.
హీరో హీరోయిన్..
హీరోయిన్స్‌లో అద్భుతమైన ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. ఆమె, ఆమె పనితనం నాకెంతో నచ్చింది.. అన్నింటి కంటే ముఖ్యంగా నా బద్రర్ వైష్ణవ్ తేజ్ గురించి చెప్పాలి.. ఓ డెబ్యూ చిత్రంలో ఇంతగొప్పగా నటించిన మరో హీరోను నేను చూడలేదంటూ ప్రశంసల వర్షం కురిపించాడు.
సుకుమార్ గురించి..
ఉప్పెన సినిమాను నిర్మించామని మైత్రి మూవీస్ గొప్పగా చెప్పుకోవచ్చు. కుమార్ 21ఎఫ్ సినిమాతో సుకుమార్ రైటింగ్స్ ఎంతగా మ్యాజిక్ క్రియేట్ చేసిందో అందరం చూశాం. మళ్లీ ఇప్పుడు ఉప్పెనతో నిరూపించారు. సుకుమార్‌ను చూస్తే ఎంతో సంతోషంగా ఉంది.. ఇంత గొప్ప విజయాన్ని అందుకున్నందుకు ఉప్పెన టీంకు కంగ్రాట్స్ అంటూ బన్నీ ప్రతీ ఒక్కరి గురించి మాట్లాడాడు.