కిక్ సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అర్జున్
మార్చి 6న పెళ్ళి కొడుకు కాబోతున్న అల్లు అర్జున్ ప్రస్తుతం బద్రీనాథ్ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత పెళ్ళిపనులు, హనీమూన్ అన్ని ముగించుకొనే ఓ ఆరునెలలు రెస్ట్ తీసుకోనున్న బన్నీ త్వరలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా లో నటించనున్నాడు.
ఈ చిత్రాన్ని ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సంస్ధకు అనుబంధ సంస్ధ అయిన ఎల్లో ఫ్లవర్స్ సంస్ధ నిర్మించనుంది. మిరపకాయ్ చిత్రంతో రంగ ప్రవేశం చేసిన తమ ద్వితీయ చిత్రాన్ని అల్లు అర్జున్ తో నిర్మించనుంది. రమేష్ పుప్పాల నిర్మాతగా అనిర్మానం కానునన్ ఈ చిత్రానికి ఆర్.ఆర్.మూవీ మేకర్స్ అధినేత వెంకట్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా మెగా అభిమానులకు స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ భారీ ఎత్తున విందు ఇవ్వబోతున్నాడు. మార్చి 6న ఆయన వివాహం హైదరాబాద్ లోని హైటెక్స్ లో అంగరంగవైభవంగా జరుగుతుంది. పెళ్ళికి ఫ్యాన్స్ ను ఆహ్వానించడం కుదరదు కనుక సతీసమేతంగా విచ్చేసి మార్చి 8న శిల్పకళావేదిక లో అభిమానులకు భారీ ఎత్తున విందు ఏర్పాటు చేస్తున్నాడు. సో... ఈ వార్త మెగా అభిమానులకు పండగే.


Click it and Unblock the Notifications











