కమల్ హాసన్ సూపర్ హిట్ మూవీలో నటించిన బన్నీ.. అదేంటో తెలుసా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప సినిమాతో ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతో ఒక్కసారిగా వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అల్లు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో... చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన సినిమాలు ఏంటో తెలుసా... ముఖ్యంగా లోకనాయకుడు కమల్ హాసన్ మూవీలో అల్లు అర్జున్ నటించారని ఇప్పటికి చాలా మందికి తెలియదు. ఈ స్టోరీలో అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన చిత్రాల గురించి తెలుసుకుందాం.
మెగా కాంపౌండ్ నుంచి... :మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, అల్లు అరవింద్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అల్లు అర్జున్ అడుగుపెట్టాడు. మొదటి సినిమానే రాఘవేంద్రరావు దర్శకత్వంలో గంగోత్రి సినిమాలో నటించాడు. ఇక ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో.. రెండో సినిమా సుకూమార్ దర్శకత్వంలో చేశాడు. ఆర్యగా బన్నీ చేసిన క్యారెక్టర్ ఇప్పటికీ మన మనసుల్లో ఉంటుంది. అంతలా ఆకట్టుకున్నాడు బన్నీ.

వరుస ఆఫర్లు.. :ఇక ఈ సినిమాతో వరుస ఆఫర్లు వచ్చాయి. బన్నీ, పరుగు, దేశముదురు.. అంటూ సినిమాలు చేసుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను తెచ్చుకున్నడు బన్నీ. అతి తక్కువ సమయంలోనే బన్నీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి.. స్టైలిష్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్పతో అయితే... ఐకానిక్ స్టార్ గా మారిపోయాడు అల్లు అర్జున్. ఇక ఈ సినిమా దేశం మొత్తన్నే కాదు.. వరల్డ్ వైడ్ గా ఓ ఊపు ఊపేసింది. ఎక్కడ చూసినా తగ్గేదేలే అంటూ పుష్ప మానేరిజాన్ని సెలబ్రేటీలు సైతం ఫాలో అయ్యారు.
రాబోయే సినిమాలు... :ఇక ఈ సినిమా కలెక్షన్లు కూడా ఓ రేంజులో వసూలు అయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ తీస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. సుకూమార్ పుష్ప ది రైస్ తర్వాత త్రివిక్రమ్ తో బన్నీ ఓ సినిమా చేయనున్నాడు. ఇటీవల ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో ఓ సినిమా చేసేందుకు అల్లు అర్జున్ కమిట్ అయ్యాడని సమాచారం.

చైల్డ్ ఆర్టిస్ట్ గా... :ఇదంతా పక్కన పెడితే.. అల్లు అర్జున్ బాలనటుడిగా నటించిన సినిమాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. అందరూ ఈ హీరో బాలనటుడిగా చేసిన మూవీ గుర్తుకు వచ్చేది చిరంజీవి డాడీ సినిమా. దానికంటే ముందే అల్లు అర్జున్... చిన్నప్పుడే కమల్ హాసన్ సినిమాలో నటించాడు. ఈ విషయం చాలా మందికి తెలియదు. అంతే కాదు చిరంజీవి డాడీ సినిమా కంటే వేరే సినిమాలో కూడా నటించాడు.

కమల్ హాసన్ తో... :లోకనాయకుడు కమల్ హాసన్ బ్లాక్ బస్టర్ మూవీ స్వాతి ముత్యం. ఇక ఈ సినిమాలో బన్నీ నటించాడు. ఇందులో అల్లు అర్జున్ కమల్ హాసన్ కు మనవడిగా నటించి మెప్పించాడు. ఇక ఆ తర్వాత చిరంజీవి విజేత సినిమాలో కూడా బన్నీ నటించాడు. ఆ తర్వాత చిరంజీవి డాడీ సినిమాలో కూడా గోపి అనే డ్యాన్సర్ క్యారెక్టర్ లో మెప్పించాడు. అలా బన్నీ.. చిన్నప్పుడే కమల్ హాసన్ సినిమాలో నటించాడు.


Click it and Unblock the Notifications











