అల్లు అర్జున్ పెర్‌ఫార్మన్స్ హైలెట్..గుణశేఖర్
"అల్లు అర్జున్ పెర్‌ఫార్మన్స్, ఆర్య కేరెక్టరైజేషన్ ఈ సినిమాకు మెయిన్ హైలైట్స్, వందమంది తమ నిజ జీవిత కుటుంబ సభ్యులతో కలిసి ఇందులో నటించారు. కథానాయికగా ఓ కొత్తమ్మాయిని పరిచయం చేస్తున్నాం అంటూ తన లేటెస్ట్ చిత్రం 'వరుడు' గురించి దర్శకుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పుకొచ్చారు. అలాగే వరుడు చిత్రంలో పాటలన్నీ వేటూరి రాశారు. ముఖ్యంగా ఓ పెళ్లి పాట కోసం ఆయన ఎంతో పరిశోధన జరిపారు. వేటూరి సాహిత్యం. మణిశర్మ సంగీతం ఈ చిత్రాన్ని బాగా ఎలివేట్ చేస్తాయి. ఆత్యాధునిక సాంకేతిక విలువలతో రూపొందుతున్న ఈ చిత్రం మార్చి 26న విడుదలకానుంది' అని చెప్పుకొచ్చారు. యూనివర్శల్ మీడియా పతాకంపై డీవీవి దానయ్య వరుడు చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అలాగే ఇదే సమావేశంలో నిర్మాత డీవీవి దానయ్య మాట్లాడుతూ...రెండు పాటలు మినహా ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈనెల 18 నుంచి ఆర్‌ఎఫ్‌సీలో ఆఖరి షెడ్యూలు జరగనుందని, ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయని నిర్మాత తెలిపారు. ఇక గుణశేఖర్, అల్లు అర్జున్ తొలి కాంబినేషన్ సినిమా ఇదే. సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు ఇందులో ఓ ప్రత్యేకపాత్రను పోషించడం విశేషం. అలాగే తమిళ యంగ్ హీరో ఆర్య ఇందులో విలన్ గా చేయటం మరో ప్రత్యేకత.
ఇక ఈ చిత్రంలో చాలా భాగం ఓ వివాహం చుట్టూ తిరుగుతుందని సమాచారం. అలాగే ఈ చిత్రం కోసం నిజమైన వంద ఫ్యామలీలను ఎంపిక చేసి వారికి ఆరు నెలలు పాటు ట్రైనింగ్ ఇచ్చి మరీ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో హీరో తాతగా ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కనిపించనున్నారు. అలాగే ఈ చిత్రం ద్వారా ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేస్తున్నారు. ఇక హీరో అల్లు అర్జున్ కు తల్లిగా ప్రముఖ నటి సుహాసిని తొలిసారిగా చేస్తోంది. కుటుంబ భావోద్వాగాలు, వినోదం కలగలపిన ఈ చిత్రం సమ్మర్ లో టాప్ గా నిలుస్తుందని ట్రేడ్ లో అప్పడే అంచనాలు మొదలయ్యాయి.
ఈ చిత్రం కీలక పాత్రల్లో సుహాసిని, నరేష్, ఆశిష్ విద్యార్థి, సయాజి షిండే,ఆహుతిప్రసాద్, బ్రహ్మానందం, బ్రహ్మాజి తదితరులు కనిపించనున్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్.డి.రాజశేఖర్, ఫైట్స్: స్టన్ శివ, ఆర్ట్: అశోక్, ఎడిటింగ్: ఆంథోని.


Click it and Unblock the Notifications











