అల్లు అర్జన్, దిల్ రాజు కాంబినేషన్ లో మరో సినిమా ..డైరక్టర్ ఎవరంటే
అల్లు అర్జున్, దిల్ రాజు కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోంది. దర్శకుడుగా జోష్ తో పరిచయమైన వాసు వర్మ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారు. వాసు వర్మ చెప్పిన స్టోరీలైన్ ఓకే చేసిన దిల్ రాజు..అల్లు అర్జున్ కి ఈ విషయం చెప్పటం జరిగింది.దిల్ రాజుపై నమ్మకం ఉన్న అల్లు అర్జున్..వాసు వర్మను దర్శకుడుగా అంగీకరించారని సమాచారం. ఇక వాసు వర్మ ఆర్య సమయం నుంచి దిల్ రాజు స్టోరీ డిపార్టమెంట్ లో రైట్ హ్యాండ్ గా ఉంటూ వచ్చారు. దాంతో దిల్ రాజు మరో సారి ఈ అవకాశం ఇవ్వటానికి ముందుకొచ్చారు. ప్రస్తుతం అల్లు అర్జున్ బద్రీనాధ్ షూటింగ్ లో బిజి గా ఉన్నారు. అనంతరం ఈ ప్రాజెక్టు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక దిల్ రాజు..మిస్టర్ ఫెరఫెక్ట్ హిట్ తో ఉషారుగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











