నాకు నచ్చలేదు... పవన్ కళ్యాణ్ గురించి అల్లు అర్జున్ అగ్రెసివ్ స్పీచ్!

By Bojja Kumar

Recommended Video

Allu Arjun Aggressive Speech At Naa Peru Surya Audio Launch

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం "నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా" ఆడియో ఫంక్షన్ మిలటరీ మాధవరంలో ఆదివారం సాయంత్రం గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించారు. ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన అగ్రెసివ్‌గా రియాక్ట్ అయ్యారు. పవర్ స్టార్‌తో తనకు ఎలాంటి విబేధాలు లేవు అని చెప్పే ప్రయత్నం చేశారు. తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని హింట్ ఇస్తూ... తామంతా ఒక్కటే కుటుంబం అని అభిమానులకు సూచించారు.

ఎండ్ ఆఫ్ ది డే మేము అంతా ఒకటే...

ఎండ్ ఆఫ్ ది డే మేము అంతా ఒకటే...

ఈ ఫంక్షన్ మాత్రమే కాదు, ప్రతి ఫంక్షన్‌కు ఉత్సాహంగా వచ్చే మెగా అభిమానులందరికీ మనస్తూర్తిగా ధన్యవాదాలు. మెగాస్టార్ గారి అభిమానులు, పవర్ స్టార్ గారి అభిమానులు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి అభిమానులు, ప్రత్యేకంగా నన్ను ఇష్టపడే స్టైలిష్ స్టార్ అభిమానులు.... ఎన్ని పేర్లు చెప్పిన అందరం మెగా కుటుంబం. అది మాత్రం మరిచిపోవద్దు. మీరు ఏ హీరోనైనా ఇష్టపడండి, వారిని ఎలాగైనా ఆరాధించండి... ఎండ్ ఆఫ్ ది డే అందరం ఒకటే. టైమ్ వచ్చినపుడు అది మీకే అర్థం అవుతుంది... అని అల్లు అర్జున్ తెలిపారు.

పవన్ కళ్యాణ్ గారు నెం. 1హీరో, సుఖాలను వదులుకుని వచ్చారు

పవన్ కళ్యాణ్ గారు నెం. 1హీరో, సుఖాలను వదులుకుని వచ్చారు

నేను ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడాలి అంటే నాకు అనిపించాలి. పవన్ కళ్యాణ్ గారి విషయంలో నాకు అది అనిపించింది కాబట్టే ఇపుడు మాట్లాడుతున్నాను. నాగబాబు గారు చెప్పినట్లు పవన్ కళ్యాణ్ గారు నెం. 1హీరో.... ఎన్నో కోట్ల రూపాయలు వస్తుంటాయి. ఎంతో సుఖవంతమైన జీవితం అనుభవించవచ్చు. అలాంటివన్నీ వద్దనుకని ఎండల్లో జనం కోసం ఏదో చేద్దామని వచ్చారు. కొంత మంది సినిమాల్లో కెరీర్ అయిపోయిన తర్వాత పాలిటిక్స్ లోకి వస్తుంటారు. కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు. నెం.1 పొజిషన్లో ఉన్నపుడు వదిలేసుకుని వచ్చారు.... అని అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు.

ఎవడెవడో ఎక్కి ఏదేదో మాట్లాడుతున్నాడు

ఎవడెవడో ఎక్కి ఏదేదో మాట్లాడుతున్నాడు

అలాంటి పవన్ కళ్యాణ్ గారు జనంలోకి, రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఎవరికి వాళ్లు బోలెడు మాటలు అంటారు. వ్యక్తిగతంగా ఎటాక్ చేస్తారు. ఒకసారి పాలిటిక్స్ లోకి వెళ్లిన తర్వాత తప్పదు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇంతకు ముందు ఒకసారి నేను చాలా హర్టయ్యాను. చాలా ఏళ్ల క్రితం చిరంజీవి గారు పాలిటిక్స్ లోకి వచ్చినపుడు ఎంతో మంది ఎన్నో మాటలన్నారు. అవి వినీ వినీ ఈ చెవు అలవాటు పడిపోయింది. ఈ మనసు గట్టిపడిపోయింది. అలాగే పవన్ కళ్యాణ్ గారిని చాలా మంది చాలా మాటలు అంటూనే ఉన్నారు. ఎవడెవడో ఎక్కి ఏదేదో మాట్లాడుతుంటారు చానల్ ఉంది కదా అని, అది మన కర్మ.... అని అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు.

ఇది చాలా చాలా పెద్ద తప్పు, నాకు నచ్చలేదు

ఇది చాలా చాలా పెద్ద తప్పు, నాకు నచ్చలేదు

కానీ... మొన్న చాలా పర్సనల్ గా మాట్లాడారు. నాకు నచ్చ లేదు. ఇది చాలా చాలా పెద్ద తప్పు. మాట్లాడినోళ్లది తప్పు, మాట్లాడించినోళ్ల తప్పు, ఇలా మాట్లాడారని లక్షల మంది జనాలకు చూపించారు అందరి కంటే పెద్ద తప్పు వారిది. వెలిగింది అగ్గిపుల్లే కావొచ్చు కానీ. అక్కడున్న పెట్రోలు ట్యాంకుది తప్పు అయిపోతోంది. ఆ విషయం నాకు నచ్చలేదు. ఈ విషయం పబ్లిక్ లోకి వచ్చిన తర్వాత ఎక్స్ ప్రెస్ చేద్దామనుకున్నాను. అందుకే ఇపుడు చెప్పాను.... అని అల్లు అర్జున్ తన మనసులోని బాధను బయట పెట్టారు.

నా తమ్ముడు రామ్ చరణ్‌కు కంగ్రాట్స్

నా తమ్ముడు రామ్ చరణ్‌కు కంగ్రాట్స్

సభా ముఖంగా నాకు ఇష్టమైన నా తమ్ముడికి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి గౌరవంగా అభినందనలు తెలియజేస్తున్నాను. రంగస్థలం పెద్ద హిట్టయినందకు ఎంటైర్ టీమ్ మొత్తానికి కంగ్రాట్స్... అని బన్నీ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X