Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
పిల్లలతో అల్లరి అర్జున్.. తోపుడు బండిలో కొడుకుతో సైలిష్ స్టార్.. స్నేహారెడ్డి చేతిలో (ఫొటోలు)
సిల్వర్ స్క్రిన్ మీద టాప్ హీరో అయినప్పటికీ.. ఫ్యామిలీ వ్యవహారాల్లో సాధారణ వ్యక్తిగా వ్యవహరించే హీరోలలో అల్లు అర్జున్ ఒకరు. వీలు చిక్కితే ఫ్యామిలీతో వెకేషన్స్‌కు వెళ్లడం ఈ స్టైలిష్ స్టార్‌కు హాబీ. తాజాగా భార్య స్నేహారెడ్డి, ఇద్దరు పిల్లలతో కలిసి స్విట్జర్లాండ్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడి పిల్లలు, భార్యతో చేస్తున్న సందడి చేస్తున్న అల్లు అర్జున్ ఫొటోలు ఇప్పుడు మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. స్టైలిష్ స్టార్ చేస్తున్న సందడి మీరు కూడా చూడండి..
కెమెరాతో క్లిక్‌మనిపించిన స్నేహారెడ్డి
అల్లు అర్జున్, అయాన్, అర్హా ఇప్పుడు యూరప్ ట్రిప్‌లో ఉన్నారు. రోడ్లపై, చెరువు గట్లపై అల్లు ఫ్యామిలీ జోష్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. పిల్లలతో కలిసి అల్లు అర్జున్ చేస్తున్న అల్లరిని భార్య స్నేహారెడ్డి కెమెరాలో బంధించింది. వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. చెరువు ఒడ్డున తన కూతుర్ని ఒడిలో పెట్టుకొని ముద్దు పెట్టుకొంటున్న సన్నివేశాన్ని క్లిక్ మనిపించింది.
మంచు పర్వతాల వద్ద హంగామా
మంచు పర్వతాల వద్ద అల్లు అర్జున్ ఫ్యామిలీ హంగామా చేసింది. అల్లు అర్జున్, స్నేహారెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి చల్లటి వాతావరణంలో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. నలుగురు కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసింది. లైఫ్ ఎలా ఉండాలంటే.. ఇలా హ్యాపీగా అంటూ కామెంట్ పెట్టింది.
రోడ్లపై స్టైలిష్ స్టార్ సాధారణ వ్యక్తిలా
అల్లు అర్జున్ తన కుమారుడిని వెంటపెట్టుకొని రోడ్లపై ఎలాంటి చింత లేకుండా ఎంజాయ్ చేశారు. అభిమానులు చుట్టుముడుతారనే భయం లేకుండా తన కొడుకును తొపుడు బండిలో కూర్చొపెట్టి తోసుకు వెళ్లగా.. స్నేహారెడ్డి కెమెరాతో క్లిక్ మనిపించింది. కూల్ డాడీ అంటూ కామెంట్ పెట్టింది.
మండుటెండలకు దూరంగా.. మంచులో హంగామా
వేకేషన్ పేరుతో హైదరాబాద్ మండుటెండల్ని అల్లు అర్జున్ ఫ్యామిలీ తప్పించుకొన్నారు. స్విట్జర్లాండ్‌లోని మంచు పర్వతాల్లో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. నెత్తికి మఫ్లర్లు, చలిని తట్టుకొనే దుస్తులను ధరించి మంచులో మునిగిపోయారు. ఇలా అల్లు అర్జున్ ఫ్యామిలీతో సమయాన్ని ఆనందంగా ఆస్వాదిస్తూ కనిపించారు.
త్రివిక్రమ్, సుకుమార్, వేణు శ్రీరాంతో
కెరీర్ విషయానికి వస్తే, అల్లు అర్జున్ త్రివిక్రమ్, సుకుమార్, వేణు శ్రీరాం చిత్రాలకు ఓకే చెప్పారు. ఇటీవల త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత మూడోసారి జతకట్టారు. ఇక సుకుమార్ సినిమా పట్టాలెక్కడానికి సిద్ధంగా ఉంది. అలాగే వేణు శ్రీరాం సినిమా కూడా ప్రారంభమయ్యేందుకు రెడీ అవుతున్నది.