»   » అల్లు అర్జున్-బోయపాటి మూవీ టైటిల్ ఫిక్స్ అయింది

అల్లు అర్జున్-బోయపాటి మూవీ టైటిల్ ఫిక్స్ అయింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ సైలెంటుగా సాగిపోతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి టైటిల్ కూడా ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తోంది.

వర్కింగ్ టైటిల్ మాత్రమే అంటూ ‘సరైనోడు' అనే టైటిల్ ప్రచారంలోకి తెచ్చారు యూనిట్ సభ్యులు. అయితే దర్శకుడు బోయపాటి ఇదే టైటిల్ అఫీషియల్ టైటిల్ అని తేల్చేసాడట. అయితే ఈ విషయాన్ని ఇప్పుడే బయట పెట్టకుండా సంక్రాంతికి విడుదలయ్యే ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారానే ప్రకటించాలని నిర్ణయించినట్లు సమాచారం.

Allu Arjun and Boyapati Movie Title

ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో బోయపాటి శ్రీను రకుల్ ప్రీత్ సింగ్ ను ఎమ్మెల్యే క్యారెక్టర్లో చూపించబోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటి వరకు రకుల్ ప్రీత్ సింగ్ అంటే గ్లామర్ డాల్ గానే మనకు తెలుసు. అయితే ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ఎలా కనిపించబోతోంది. గ్లామరస్‌గా కనిపిస్తుందా? లేక ఎమ్మెల్యే పాత్రలో పవర్ ఫుల్‌గా కనిపించబోతోందా? అనేది తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్ రూపొందుతోన్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌, కేథరిన్‌ హీరోయిన్స్. శ్రీకాంత్‌, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే అల్లు అర్జున్‌, కేథరిన్‌, ఆది పినిశెట్టి తదితరులపై కొన్ని కీలకమైన సన్నివేశాలు తెరకెక్కించారు. బన్నీ తన సినిమాల్లో స్త్టెల్‌కి ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇందులోనూ విభిన్నమైన గెటప్‌లో కనిపించబోతున్నారట. యాక్షన్‌తో పాటు వినోదం, కుటుంబ బంధాలకూ ఈ చిత్రంలో ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది.

English summary
Director oyapati known for hyperbole is now silently filming Allu Arjun’s movie and refraining from public appearances excessively. “Sarainodu” is the apt title for the subject he believes but he wants the title to be announced at the time of Sankranthi with the first look stills.
Please Wait while comments are loading...