ఇంటర్వెల్‌లో ఇది మాత్రం మర్చిపోవద్దు.. నాని జెర్సీ గురించి అల్లు అర్జున్, నిఖిల్!

Recommended Video

Allu Arjun And Nikhil Praises Nani's Jersey Movie Success || Filmibeat Telugu

నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ చిత్రం శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. గత ఏడాది నానికి పెద్దగా కలసి రాలేదు. నానికి అర్జెంట్ గా హిట్ అవసరం అన్న తరుణంలో గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన జెర్సీ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది. తొలి షో నుంచే జెర్సీ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. క్రిటిక్స్ కూడా ఈ చిత్రాన్ని మంచి రివ్యూలు ఇస్తున్నారు. జెర్సీ చిత్రంలో నాని నటన, ఎమోషన్స్ తో వన్ మాన్ షో చేశాడని అంటున్నారు. సెలెబ్రిటీలు వరుసగా నానికి కంగ్రాట్స్ చెబుతూ సోషల్ మీడియా ద్వారా ప్రశంసిస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ జెర్సీ చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

హృదయాన్ని హత్తుకునే చిత్రం

అల్లు అర్జున్ జెర్సీ చిత్రం గురించి ట్విట్టర్ లో స్పందించాడు. ఇప్పుడే జెర్సీ చిత్రాన్ని చూశా. బ్రిలియంట్.. హృదయాన్ని హత్తుకునే చిత్రం. చిత్రంలోని ప్రతి అంశం నాకు నచ్చింది. చిత్ర బృందానికి కంగ్రాట్స్. నాని.. నువ్వు అదరగొట్టేశావ్.ఇది నీ కెరీర్ లోనే అత్యుత్తమ ప్రదర్శన. నటీనటులు, సాంకేతిక నిపుణులు అద్భుతమైన నైపుణ్యాని ప్రదర్శించారు అని బన్నీ ప్రశంసలు కురిపించాడు.

 గౌతమ్ గురించి

గౌతమ్ గురించి

హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్ అద్భుతంగా నటించింది. సంగీత దర్శకుడు అనిరుధ్ పనితనం బావుందని బన్నీ ప్రశంసించాడు. చివరగా ముఖ్యమైన వ్యక్తి గురించి మాట్లాడాలి. అతడే ఈ చిత్ర కెప్టెన్ గౌతమ్ తిన్ననూరి. స్టడీగా, బోల్డ్ గా జెర్సీ చిత్రంతో అద్భుతం చేశావు. సినిమా ప్రియులంతా ఈ చిత్రాన్ని తప్పకుండా చూడాలని బన్నీ తెలిపాడు.

ఇంటర్వెల్‌లో మర్చిపోవద్దు

యంగ్ హీరో నిఖిల్ కూడా జెర్సీ చిత్రం గురించి స్పందించాడు. కంగ్రాట్స్ నాని భాయ్. పడిన కష్టానికి ఫలితం సూపర్బ్ గా వచ్చింది. జెర్సీ చిత్రాన్ని ఎవరూ మిస్ కావద్దు అని నిఖిల్ తెలిపాడు. అదే ట్వీట్ లో మరో ఆసక్తికర కామెంట్ కూడా చేశాడు. జెర్సీ చిత్రం ఇంటర్వెల్ లో అర్జున్ సురవరం ట్రైలర్ వస్తుంది. దానిని కూడా ఎవరూ మిస్ కావద్దు అంటూ నిఖిల్ ట్వీట్ చేశాడు.

అల్లరి నరేష్

కామెడీ హీరో అల్లరి నరేష్ జెర్సీ చిత్రానికి శుభాకాంక్షలు తెలియజేసాడు. నాని మునిపటికన్నా ఈ చిత్రంలో అద్భుతంగా నటించాడని అల్లరి నరేష్ ప్రశంసించాడు. ఇప్పటికే ఎన్టీఆర్, డైరెక్టర్ మారుతి లాంటి సెలెబ్రిటీలంతా జెర్సీ చిత్రం చూసి ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. ప్రతి ఒక్కరూ నాని కెరీర్ లో ఇది బెస్ట్ ఫిలిం అని ప్రశంసిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X