Just In
- 5 hrs ago
బండ్ల గణేష్‌కు తీవ్ర అస్వస్థత.. ఐసీయూలో చేరిన స్టార్ ప్రొడ్యూసర్
- 5 hrs ago
Vakeel Saab Day 5 collections.. చరిత్ర సృష్టించిన పవన్ కల్యాణ్.. లాక్డౌన్ తర్వాత అరుదైన రికార్డు
- 5 hrs ago
ఏక్ లవ్ యా అంటూ నిర్మాతగా మారిన పూరీ జగన్నాథ్ హీరోయిన్.. సొంత తమ్ముడే హీరోగా
- 5 hrs ago
ఐదు భాషల్లో ఆర్జీవి ‘దెయ్యం’.. ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు.. రిలీజ్ ఎందుకు లేట్ అయిందంటే..
Don't Miss!
- News
గూర్ఖాలూ ఆందోళన వద్దు! మీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం: అమిత్ షా
- Sports
KKR vs MI:గెలిచే మ్యాచ్‌లో ఓడిన కోల్‌కతా.. ముంబై ఇండియన్స్ బోణీ!
- Finance
సెన్సెక్స్ 660 పాయింట్లు జంప్, మార్కెట్ అదరగొట్టడం వెనుక...
- Automobiles
డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌తో రానున్న యమహా ఎమ్‌టి-15 బైక్: డీటేల్స్
- Lifestyle
Sun Transit in Aries on 14 April:మేషంలోకి సూర్యుడి సంచారం.. ఈ రాశుల వారికి ప్రత్యేకం...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఊరికే స్టైలీష్ స్టార్ అయిపోరు.. బన్నీ హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ కేక.. మెగా ఈవెంట్లో అల్లు జంట
ఓ స్టార్ డమ్ వచ్చే వరకు ఎంత కష్టపడతారో.. వచ్చాక దాన్ని నిలబెట్టుకోవడానికి అంతకు పదింతలు కష్టపడాల్సి వస్తుంది. టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కూడా అంతే. స్టైలీష్ స్టార్‌గా అవతరించడానికి కెరీర్లో ఎంత కష్టపడ్డాడో.. దాన్ని నిలబెట్టుకోవడానికి నేటికీ అంతే కష్టపడుతుంటాడు. బన్నీ ఎక్కడికైనా వెళ్లినా, ఏదైనా ఫంక్షన్‌కు అటెండ్ అయినా, అది సినిమా, ఫ్యామిలీ ఈవెంట్ అయినా సరే ప్రత్యేకంగా కనిపిస్తాడు.

బన్నీ స్టైలే డిఫరెంట్..
బన్నీ నలుగురిలో నారాయణలా ఉండడు. నలుగురికి ఒకడిలా ఉంటాడు. ప్రత్యేకంగా కనిపిస్తాడు. అలా కనిపించేందుకు నిత్యం కృషి చేస్తాడు కూడా. అది ఫిట్ నెస్ విషయంలో కావొచ్చు, డ్రెస్సింగ్ విషయంలోనూ కావొచ్చు. హెయిర్ స్టైల్ విషయంలోనూ కావచ్చు. పది మంది కళ్లు పెద్దవి చేసి చూసేలా ఆశ్చర్య పరుస్తుంటాడు.

మెగా ఈవెంట్..
నిహారిక-చైతన్యల నిశ్చితార్థం నిన్న (ఆగస్ట్ 13) కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఓ ప్రయివేట్ హోటల్లో జరిగిన ఈ వేడుకకు కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. ఇక ఈ వేడుకులో మెగా, అల్లు జంటలన్నీ వైరల్ అయ్యాయి. అందరూ సతీ సమేతంగా ఫోటోలకు పోజులివ్వడంతో వేడుకకే ఓ కళ వచ్చేసింది.

స్పెషల్ లుక్..
అసలే బన్నీ ప్రస్తుతం పుష్ప కోసం డిఫరెంట్ లుక్‌ను ట్రై చేస్తున్నాడు. ఆ క్రమంలో భారీగా జుట్టును, బాడీని పెంచేస్తున్నాడు. గడ్డం కూడా లైట్‌గా వెరైటీగా పెంచుతున్నాడు. అలాంటి బన్నీ ఇలాంటి ప్రత్యేకమైన ఈవెంట్‌కు వస్తే ఎలా తయారవుతాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిన్నటి ఈవెంట్లో కళ్లన్నీ బన్నీపైనే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.

జంటగా అదుర్స్..
ఇక బన్నీ నల్లటి దుస్తులు, రింగు రింగులుగా తిరిగిన జుట్టుతో కొత్త పెళ్లి కొడుకులు ఉన్నాడు. తన శ్రీమతి స్నేహాతో దిగిన ఫోటోలు చూస్తూంటే వీరిద్దరి నిశ్చితార్థపు వేడుకలా అనిపించింది. ఇక వీరిద్దరి ఫోటోలు, ఆ పోజులు నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతున్నాయి.

వారికి స్పెషల్ థ్యాంక్స్..
అల్లు అర్జున్, అల్లు స్నేహాల ఫోటోలు అంతగా క్లిక్ అవ్వడం వెనుకు దాగి ఉన్న శ్రమ, ఆ వ్యక్తులను బన్నీ స్పెషల్‌గా థ్యాంక్స్ చెప్పాడు. హర్మాన్ కౌర్, ఇంద్రనీల్ రాథోడ్, AA స్టాఫ్‌కు ధన్యవాదాలను తెలిపాడు. మొత్తానికి నిహారిక నిశ్చితార్థం ఏమో గానీ టాలీవుడ్ స్టైలీష్ కపుల్ అని బన్నీ మరోసారి నిరూపించుకున్నాడు. ఇద్దరు పిల్లల పేరెంట్స్ అయినా సరే నవదంపతుల్లానే కనిపించడంతో బన్నీ ఫ్యాన్స్ తెగ సంబరపడి పోతున్నారు.