twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫోటోలు: అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా ప్రారంభోత్సవం.. కొత్తగా కనిపిస్తున్న బన్నీ!

    |

    నా పేరు సూర్య విడుదలైన దాదాపు ఏడాది తర్వాత అల్లు అర్జున్ తన కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని ఈ చిత్ర పూజా కార్యక్రమం శనివారం జరిగింది. నా పేరు సూర్య నిరాశ పరిచిన తర్వాత బన్నీ ఫ్యాన్స్ మరో చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూశారు. కానీ అల్లు అర్జున్ ఏడాది కాలంగా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. మంచి కథ కోసం ఎదురు చూస్తున తరుణంలో తనకు అచొచ్చిన దర్శకుడు త్రివిక్రమ్ తోనే సినిమా ప్రారంభించాడు.

     పూజా కార్యక్రమం

    పూజా కార్యక్రమం

    అల్లు అర్జున్, త్రివిక్రమ్ చిత్రానికి ప్రకటన కొన్ని నెలల క్రితమే జరిగింది. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉండడం వల్ల సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు చిత్రాన్ని ప్రారంభించారు. అల్లు అర్జున్ 19వ చిత్ర పూజా కార్యక్రమం శనివారం రోజు లాంఛనంగా జరిగింది. హారిక అండ్ హాసిని, గీతా ఆర్ట్స్ బ్యానర్స్ లో ఈ చిత్రం రూపొందబోతున్న సంగతి తెలిసిందే.

     ఎవరెవరు వచ్చారంటే

    ఎవరెవరు వచ్చారంటే

    పూజా కార్యక్రమానికి అల్లు అర్జున్, త్రివిక్రమ్ తో పాటు ఈ సినిమాలో భాగం కాబోతున్న వారు హాజరయ్యారు. హారికా అండ్ హాసిని నిర్మాత రాధాకృష్ణ, అల్లు అరవింద్ హాజరయ్యారు. త్రివిక్రమ్ రాసిన స్క్రిప్ట్ కు పూజారి ఆశీర్వాదం అందించారు. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే.

    ముహూర్తపు షాట్

    ముహూర్తపు షాట్

    అల్లు అర్జున్ ముహూర్తపు షాట్ తో చిత్రాన్ని ప్రారంభించడం విశేషం. గోధుమ రంగు షర్ట్ ధరించిన బన్నీ సింపుల్ గా వచ్చాడు. ఈ చిత్రం కోసం బన్నీ పొడవాటి హెయిర్ స్టైల్ లో కొత్తగా కనిపిస్తున్నాడు. గతంలో అల్లు అర్జున్ దేశముదురు చిత్రం కోసం లాంగ్ హెయిర్ పెంచిన సంగతి తెలిసిందే. ప్రతి చిత్రంలో తన హెయిర్ కొత్తగా ఉండేలా బన్నీ జాగ్రత్త తీసుకుంటాడు.

    షూటింగ్ ఎప్పటి నుంచి అంటే

    షూటింగ్ ఎప్పటి నుంచి అంటే

    ఇక అల్లు అర్జున్ 19వ చిత్ర షూటింగ్ ఏప్రిల్ 24 నుంచి ప్రారంభం కాబోతోంది. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే రెండవ సారి నటిస్తోంది. గతంలో వీరిద్దరూ డీజే చిత్రంలో మెరిసిన సంగతి తెలిసిందే. గత ఏడాది త్రివిక్రమ్ అజ్ఞాతవాసి చిత్రంతో నిరాశపరిచినా ఆ తర్వాత అరవింద సమేత చిత్రంతో తిరిగి పుంజుకున్నాడు. బన్నీ చిత్రంతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. నాన్న సెంటిమెంట్ తో ఈ చిత్రం ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    English summary
    Allu Arjun and Trivikram's new film stars with PoojaCeremony. Regular shoot starts from 24th April.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X