twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బన్నీ, త్రివిక్రమ్ సినిమా నిరీక్షణకు తెర.. హీరోయిన్ రిపీట్, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే!

    |

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అర్జున్ చివరగా నటించిన చిత్రం నా పేరు సూర్య. ఈ చిత్రం బన్నీ ఫాన్స్ ని తీవ్రంగా నిరాశపరిచింది. అల్లు అర్జున్ తదుపరి చిత్రంతో ఎలాగైనా మంచి విజయం అందుకోవాలని భావిస్తున్నాడు. ఆలస్యమైనా అన్నీ పక్కాగా కుదిరేవరకు నెక్స్ట్ మూవీని ప్రారంభించడం లేదు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ చిత్రానికి ప్రకటన జరిగి చాలా కాలం అవుతోంది. కానీ ఈ చిత్రం ఇంతవరకు ప్రారంభం కాకపోవడంతో అల్లు అర్జున్ అభిమానులు నిరాశకు గురవుతున్నారు. సోమవారం రోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు సంధర్భంగా అభిమానులలో జోష్ ని నింపే ప్రకటనలు వస్తున్నాయి. తాజాగా త్రివిక్రమ్, బన్నీ సినిమా గురించి హారిక అండ్ హాసిని సంస్థ ఫుల్ క్లారిటీ ఇచ్చింది.

     షూటింగ్ ఎప్పటినుంచి అంటే

    షూటింగ్ ఎప్పటినుంచి అంటే

    అల్లు అర్జున్, త్రివిక్రమ్ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ని ఏప్రిల్ 24 నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రాన్ని రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మించనున్నారు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇది హ్యాట్రిక్ మూవీ. హారిక అండ్ హాసిని సంస్థతో కూడా బన్నీకి ఇది మూడవ చిత్రమే. వీరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు మంచి విజయం సాధించాయి.

     బన్నీతో రెండోసారి రొమాన్స్

    బన్నీతో రెండోసారి రొమాన్స్

    త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రంలో బన్నీ సరసన నటించబోయే హీరోయిన్ ని కూడా ప్రకటించారు. ప్రస్తుతం భారీ చిత్రాలతో దూసుకుపోతున్న పూజ హెగ్డే అల్లు అర్జున్ తో రెండవసారి రొమాన్స్ చేయబోతోంది. వీరిద్దరూ డీజే చిత్రంలో జంటగా నటించారు. ఇక త్రివిక్రమ్ దర్శత్వంలో కూడా పూజ హెగ్డే రెండవసారి నటించబోతోంది. గత ఏడాది వచ్చిన అరవింద సమేత చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటించిన సంగతి తెలిసిందే.

    మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే

    మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే

    క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ ని సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారు. అల్లు అర్జున్, తమన్ కాంబోలో రేసుగుర్రం, సరైనోడు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. అరవింద సమేత చిత్రానికి కూడా తమన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. దీనితో త్రివిక్రమ్ శ్రీనివాస్ తమన్ వైపే మొగ్గు చూపాడు.

    వీలైనంత త్వరగా

    షూటింగ్ ఇప్పటికే ఆలస్యంగా ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ చిత్రంలో బన్నీ సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే అల్లు అర్జున్ ఈ చిత్రం కోసం పొడవుగా హెయిర్ పెంచుతున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని ఎలాంటి కథతో తెరక్కించబోతున్నాడు అనే క్లారిటీ లేదు. గత ఏడాది అరవింద సమేత చిత్రాన్ని ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కించి మ్యాజిక్ చేశాడు.

    English summary
    Allu Arjun and #Trivikram's next Regular shoot starts from 24th April. Here are the details of AA19 movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X