twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నంది అవార్డుల ఎంపికపై అల్లు అర్జున్, ప్రభాస్ ఆగ్రహం.. తీవ్ర అసంతృప్తి

    By Rajababu
    |

    Recommended Video

    నంది అవార్డుల ఎంపికపై ఫైర్ అవుతున్న హీరోలు

    నంది అవార్డుల ఎంపిక విధానంపై తెలుగు సినీ పరిశ్రమలో ఓ వర్గం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నది. కేవలం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నవారికే అవార్డులను కట్టబెట్టారనే విమర్శ బలంగా వినిపిస్తున్నది. నంది అవార్డులపై చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నప్పటికీ.. కొన్ని కారణాల వల్ల పెదవి విప్పలేకపోతున్నట్టు సమాచారం. అయితే నంది అవార్డుల ఎంపికపై స్టైలిష్ స్టార్, మెగా హీరో అల్లు అర్జున్, ప్రభాస్ ఆగ్రహంతో ఉన్నట్టు ఓ జాతీయ వెబ్‌సైట్ కథనాన్ని ప్రచురించింది.

     అల్లు అర్జున్ ఆగ్రహం

    అల్లు అర్జున్ ఆగ్రహం

    తాజాగా ప్రకటించిన అవార్డుల్లో అల్లు అర్జున్‌కు ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్ అవార్డును ప్రకటించారు. ఈ అవార్డును ఇవ్వడంపై అల్లు అర్జున్ ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. ఆ అవార్డును ఇచ్చి తనను అవమానించినట్టు ఫీల్ అవుతున్నట్టు తెలుస్తున్నది.

    అల్లు అర్జున్‌కు ఆ అవార్డు ఇస్తారా?

    అల్లు అర్జున్‌కు ఆ అవార్డు ఇస్తారా?

    గత మూడు సంవత్సరాలలో టాలీవుడ్‌కు రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఘనత అల్లు అర్జున్‌ పేరిట ఉంది. అలాంటి హీరోకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు ఇవ్వడమేమిటి అని సినీ పరిశ్రమలో ఓ వర్గం అభిప్రాయపడుతున్నది. ఇది ముమ్మాటికీ మెగా ఫ్యామిలీని చంద్రబాబు ప్రభుత్వం అవమానించడమే అనే భావనను వ్యక్తం చేస్తున్నారు.

     గతంలో కూడా మెగా ఫ్యామిలీకి

    గతంలో కూడా మెగా ఫ్యామిలీకి

    చిరంజీవి ఫ్యామిలీ అవార్డుల ఎంపిక విషయాన్ని చాలా లైట్‌గా తీసుకొన్నప్పటికీ మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరాశను కలిగిస్తున్నది. గతంలో కూడా పవన్ కల్యాణ్, రాంచరణ్‌కు జరిగిన అన్యాయాన్ని ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు.

     బాహుబలి ప్రభాస్ అవార్డు ఏది?

    బాహుబలి ప్రభాస్ అవార్డు ఏది?

    ఇక ప్రభాస్ పరిస్థితి మహాదారుణంగా ఉంది. బాహుబలి1, బాహుబలి2 చిత్రాలతో ప్రభాస్ అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించారు. ప్రభాస్ నటనకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు నీరాజనం పట్టారు. అలాంటి బాహుబలి పాత్రను పోషించిన ప్రభాస్‌కు అవార్డు దక్కకపోవడం సినీ పండితులను ఆశ్చర్యానికి గురిచేసింది.

    ప్రభాస్ అసంతృప్తి?

    ప్రభాస్ అసంతృప్తి?

    ప్రభాస్‌కు అవార్డు రాకపోవడంపై ఆయన సన్నిహితులు కూడా షాక్ అయ్యారు. ప్రభుత్వ, జ్యూరీ నిర్ణయంపై ప్రభాస్ తీవ్ర అసంతృప్తిని తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. బాహుబలి చిత్రానికి మొత్తం 14 అవార్డులు వచ్చినప్పటికీ.. ఆ చిత్రానిక మూలస్తంభంగా నిలిచిన ప్రభాస్ అవార్డు దక్కకపోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు.

     సినీ ప్రముఖులకు నంది పలకరింపు

    సినీ ప్రముఖులకు నంది పలకరింపు

    2014, 2015, 2016, సంవత్సరాలకు ప్రకటించిన నంది అవార్డుల్లో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, అనుష్క, రితూ వర్మ, రాజమౌళి లాంటి టాలీవుడ్ ప్రముఖులకు చోటు దక్కింది. కమల్ హాసన్, రజనీకాంత్, చిరంజీవికి జాతీయ పురస్కరాలతో సత్కరించనున్నారు.

    English summary
    The Nandi Award for 2014, 2015, 2016 were announced. Kamal Haasan, Rajinikanth, SS Rajamouli, Rana Daggubati, Ritu Varma, Anushka Shetty, Jr NTR, Allu Arjun were among the winners. Most of the celebs have taken to social media to thank Nandi Awards for the honours. Reports, Allu Arjun is seeing red over the winners list. Apart from Allu Arjun, even Prabhas was not honoured in a single category despite his powerful performance in Baahubali, while the film was felicitated with 14 awards.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X