twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్ తో స్టార్ డైరెక్టర్ నైట్ సిట్టింగ్.. మరో ప్రాజెక్ట్ కోసం..?

    |

    పుష్ప సినిమాతో బాక్సాఫీసు వద్ద మొదటి పాన్ ఇండియా సక్సెస్ ను అందుకున్న అల్లు అర్జున్ ఆ తరువాత కూడా అదే తరహాలో కొనసాగాలని సరైన ప్రాజెక్టులను వెతికే పనిలో పడ్డాడు. ఇక ఇటీవల అల్లుఅర్జున్ తనకు ఎంతో ఇష్టమైన దర్శకుడితో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఆ స్టార్ దర్శకుడు అల్లుఅర్జున్ తో అర్థరాత్రి వరకు కూడా మాట్లాడినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఒక పోస్టు వైరల్ గా మారుతోంది.

    పుష్ప 2తో కూడా

    పుష్ప 2తో కూడా

    స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ పుష్ప అనంతరం రెండో భాగాన్ని కూడా అంతకుమించి అనేలా తెరపైకి తీసుకు రావాలని అనుకుంటున్నాడు. దర్శకుడు సుకుమార్ కూడా ప్రాజెక్టు విషయంలో ఈసారి పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని ఆలోచిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు ఫినిష్ అయ్యింది. కేవలం ఒక చివరి షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉంది. అయితే సుకుమార్ కొన్ని మార్పులు చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా టాక్ అయితే కొనసాగుతోంది.

    ఆ సినిమా విషయంలో కన్ఫ్యూజన్

    ఆ సినిమా విషయంలో కన్ఫ్యూజన్

    ఇక పుష్ప 2 సినిమా తర్వాత అల్లు అర్జున్ ఎలాంటి సినిమాతో వస్తాడు అనే విషయంలో అయితే ఇంతవరకు సరైన క్లారిటీ ఇవ్వలేదు. పెద్ద దర్శకులతో అతను నిత్యం చర్చలు జరుపుతూనే ఉన్నాడు గాని ఇంకా ఏ ప్రాజెక్టు కూడా ఫైనల్ చేయలేదు. వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ తో ఒక సినిమా ప్రకటించాడు. కానీ ఆ సినిమా తెరపైకి వస్తుందా లేదా అనే విషయంలో కూడా అనేక రకాల అనుమానాలు కలుగుతున్నాయి.

    ఆ దర్శకులతో

    ఆ దర్శకులతో

    బోయపాటి శ్రీను దర్శకత్వంలో కూడా అల్లుఅర్జున్ ఓ సినిమా చేయాల్సి ఉంది. అలాగే ఆ మధ్యకాలంలో కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కూడా అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ లో వరుసగా మూడు రోజులు చర్చలు జరిపాడు. ఆ కాంబినేషన్ లో కూడా సినిమా వచ్చే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి.

    హరీష్ శంకర్ తో

    హరీష్ శంకర్ తో

    అయితే ఇటీవల దర్శకుడు హరీష్ శంకర్ తో కూడా అల్లుఅర్జున్ అర్ధరాత్రి వరకు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. హరీష్ శంకర్ తో ఇదివరకే అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం అనే సినిమా చేశాడు. ఆ సినిమా కమర్షియల్గా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక త్వరలోనే వీరి కలయికలో మరో సినిమా కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా గతంలోనే చాలా వార్తలు వచ్చాయి.

    Recommended Video

    Harish Shankar : థియేటర్లు మాకు పుణ్యక్షేత్రాలు.. Pushpa ఎలా ఆడిందో తెలుసుగా | Filmibeat Telugu
    ట్విట్టర్ లో పోస్ట్.. ఎందుకు తగ్గాలి

    ట్విట్టర్ లో పోస్ట్.. ఎందుకు తగ్గాలి

    అయితే అర్ధరాత్రి సమయంలో హరీష్ శంకర్ అల్లు అర్జున్ తో దిగిన ఫోటోను తన ట్విట్టర్లో షేర్ చేసుకుకున్నడు. ఎప్పుడొచ్చినా నవ్వుతూనే ఉంటారు. మీతో సరదాగా గడిపాను. తదుపరి సమయం వరకు, లవ్ యు.. తగ్గేదేలే.. ఎందుకు తగ్గాలి.. అంటూ హరీష్ శంకర్ వివరణ ఇచ్చారు. అయితే సినిమా ఉంటుందా లేదా అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. కానీ వీరి కలయికలో మరొక సినిమా రావచ్చని టాక్ వస్తోంది. మరి ఆ టాక్ ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.

    English summary
    Allu arjun another movie with director harish shankar..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X