Major మూవీపై అల్లు అర్జున్ రివ్యూ.. మహేష్ బాబు గురించి స్టైలిష్ స్టార్ ఏమన్నారంటే?
ఈ మధ్య కాలంలో సినీ హీరోలు వేరే హీరోల సినిమాలు నచ్చితే ప్రశంసించడానికి ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు.. సినిమా చూసిన తర్వాత తమకు నచ్చితే వెంటనే సోషల్ మీడియా వేదికగా సినిమా బాగుంది అంటూ తమకు ఎంత బాగా నసిచ్చిందో వివరిస్తూ సుదీర్ఘంగా స్పందిస్తున్నారు కూడా. అయితే తాజాగా విడుదలైన మేజర్ సినిమా గురించి ఇప్పటి వరకు పెద్దగా సెలబ్రిటీలు స్పందించిన దాఖలాలు లేవు కానీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా చూసి ఇప్పుడు సినిమా మీద తన రివ్యూ ఇచ్చారు. అయితే మేజర్ సినిమా అల్లు అర్జున్ కి ఏ మేరకు నచ్చిందనే వివరాల్లోకి వెళితే..

అంతకంతకూ
26/11 ఎటాక్స్ లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా మేజర్ అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో హీరోగా నటించగా హీరోయిన్ గా సాయి మంజ్రేకర్ నటించింది. శోభితా ధూళిపాళ ఒక కీలక పాత్రలో నటించగా ప్రకాష్ రాజ్, రేవతి, సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రుల పాత్రలలో నటించి ప్రేక్షక లోకాన్ని మెప్పించారు. జూన్ మూడో తేదీన విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన దక్కుతోంది. సినిమా కలెక్షన్లు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి.

శేష్ మళ్లీ మ్యాజిక్ చేశాడు
తాజాగా ఈ సినిమాను తాను వీక్షించినట్లు చెబుతూ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మేజర్ సినిమా టీం మొత్తానికి కంగ్రాచ్యులేషన్స్ అంటూ ఆయన ట్వీట్ మొదలు పెట్టారు. ఈ సినిమా హార్ట్ టచింగ్ సినిమా అని, అడివి శేష్ వన్ మాన్ షో అని పేర్కొన్నారు. అడివి శేష్ మళ్లీ మ్యాజిక్ చేశాడు అని పేర్కొన్న ఆయన ప్రకాష్ రాజ్ ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇమిడిపోయారు.

అద్భుతంగా తీర్చిదిద్దారు
రేవతి, సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ, మాత్రమేగాక మిగతా పాత్రధారులందరూ సినిమాకు ప్రాణం పోశారు అని పేర్కొన్నారు. ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారని, దర్శకుడు శశి కిరణ్ తిక్కాది ఎక్స్లెంట్ వర్క్ అని అల్లు అర్జున్ కొనియాడారు. సినిమా మొత్తాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని పేర్కొన్న ఆయన మహేష్ బాబుకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
గుండెని తడుతుంది
ప్రేక్షకుల ముందుకు ఇలాంటి ఒక హృదయాన్ని హత్తుకునే అనుభూతిని తీసుకు వచ్చినందుకు మహేష్ బాబుకు అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేజర్ సినిమా ప్రతి ఒక్క భారతీయుడి గుండెని తడుతుంది అంటూ ఆయన తన రివ్యూలో పేర్కొన్నారు. ఇక తాజాగా సినిమా యూనిట్ సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది.

కంటతడి
ఈ సందర్భంగా ఈ సినిమా దర్శకుడు శశికిరణ్ మీడియాతో మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు. సినిమా షూటింగ్ సమయంలో తన తండ్రి చనిపోయారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాలో రేవతి, ప్రకాష్ రాజ్ పాత్రలు చూస్తుంటే ప్రేక్షకులు అందరి లాగే తనకు కూడా తన తల్లిదండ్రులు గుర్తుకు వచ్చారని చెబుతూ, భావోద్వేగానికి గురయ్యారు. పక్కనున్న వారు ఆయను ఓదార్చారు.


Click it and Unblock the Notifications











