Allu Arjun: ఊహించని పరిణామం.. ఆసుపత్రికి అల్లు అర్జున్ తరలింపు..
Allu Arjun Arrest: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాన్ ఇండియా మూవీ ' పుష్ప 2' రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదైన నేపథ్యంలో ఎవరూ ఊహించని విధంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు చేశారు. తాజాగా అల్లు అర్జున్ ను గాంధీ ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఏమైంది?
పుష్ప సినిమా విడుదల రోజున ప్రీమియర్స్ లో సంధ్య 70 ఎం ఎం థియేటర్ దగ్గర విషాద ఘటన తీవ్ర దుమారం రేపింది. పుష్ప 2 ప్రీ రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై హీరో అల్లు అర్జున్ కూడా స్పందించారు. ఈ ఆ కుటుంబానికి అండగా ఉంటానని, రూ.25 లక్షల నష్టపరిహారాన్ని అందజేస్తామని తెలిపారు. మరి ఈ విషయంలో బాధిత కుటుంబం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఫైల్ చేయగా కంప్లీట్ నమోదైంది.

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్‌పై బీఎన్‌ఎస్ 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చిన సమయంలో భద్రతాపరంగా జాగ్రత్తలు తీసుకోనందుకు థియేటర్ యాజమాన్యంపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు. తాజాగా అల్లు అర్జున్ ని అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ అల్లు అర్జున్ స్టేట్మెంట్ తీసుకొని నమోదు చేశారు. రిమాండ్ రిపోర్టును తయారు చేశారు. అనంతరం వైద్య పరీక్షలు నిమిత్తం అల్లు అర్జున్ ను గాంధీహాస్పిటల్ కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
105 సెక్షన్ అనేది నాన్ బెయిలబుల్ కేసు. ఒక వేళ నేరం రుజువైతే.. అల్లు అర్జున్ కు ఐదు నుంచి పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. మరోవైపు BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల వరకు శిక్షపడే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో అల్లు అర్జున్ న్యాయవాదులు క్వాష్ పిటిషన్ వేసే అవకాశం ఉంది. ఇంకోవైపు.. చిక్కడపల్లి పీఎస్ కు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్, సోదరుడు శిరీష్ చేరుకున్నారు. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











