నిజానికి నాకంత సీన్ లేదంటున్న అల్లు అర్జున్
సుకుమార్ తన గురించి పొడిగేశారనీ, నిజానికి తనకంత సీన్ లేదనీ, ఆర్య అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ సుకుమార్ దేననీ అల్లు అర్జున్ అన్నారు. అల్లు అర్జున్, కాజల్ హీరోహీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో భోగవల్లి ప్రసాద్, ఆదిత్య బాబు సంయుక్తంగా నిర్మించిన 'ఆర్య 2' ఆడియో విడుదల కార్యక్రమం హైద్రాబాద్ లో ఆదివారంనాడు పరిశ్రమ కన్నులపండువగా జరిగింది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఆడియో సీడీని నాగబాబు, ప్రభాస్ సంయుక్తంగా విడుదల చేశారు. దిల్ రాజు, మాగంటి బాబు, శ్రీనువైట్ల, వరుణ్ సందేష్, ఆర్యన్ రాజేష్, మెహర్ రమేష్ లాంఛనంగా ఒక్కో పాటను రిలీజ్ చేశారు.
అలాగే దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ, తన గత చిత్రం 'జగడం' నిరుత్సాహ పరిచిందనీ, ఆ సమయంలో తనకు ఓదార్పు ఇచ్చి ఓ మంచి హిట్ నీకోసం ఎదురుచూస్తోందని చెప్పిన రాజమౌళికి తన కృతజ్ఞతలనీ అన్నారు. కష్టకాలంలో తనకు భోగవల్లి ప్రసాద్ అండగా నిలబడ్డారని అన్నారు. అలాగే కథ చెప్పగానే అల్లు అర్జున్ అంగీకరించారనీ, ఈ చిత్రం అన్ని వర్గాల ఆడియెన్స్ ను అలరిస్తుందని నిశ్చయంగా చెప్పగలననీ అన్నారు.
ఈ కార్యక్రమలో ఎస్.ఎస్.రాజమౌళి, వి.వి.వినాయక్, క్రిష్, గుణ్ణం గంగరాజు, జెమినీ కిరణ్, అల్లు అర్జున్, నవదీప్, కాజల్, శ్రద్ధాదాస్, సుకుమార్, బివిఎస్ఎన్ ప్రసాద్, ఆదిత్య బాబు, రామ్-లక్ష్మణ్, సినిమాటోగ్రాఫర్ రాజశేఖర్, పలువురు చిత్ర సాంకేతిక నిపుణులు వేడుకలో పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











