ఆర్య-2..ఆక్రందన

ఇక అల్లు అర్జున్ కెరీర్ ప్రారంభంలో ఆయనకు మంచి బ్రేక్ ఇచ్చిన 'ఆర్య' చిత్రానికి సీక్వెల్ గా ఈ తాజా చిత్రం రూపొందుతోంది. ఆ చిత్రం దర్శకుడైన సుకుమార్ ఈ సీక్వెల్ కు సైతం దర్శకత్వం వహిస్తున్నాడు. జగడం నిర్మించిన ఆదిత్య ఆర్ట్స్ బ్యానర్ పై వి.ఆదిత్యబాబు, భోగవల్లి ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైద్రాబాద్ లో ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఇంతవరకూ 'ఆర్య-2'గా ప్రచారమైన ఈ చిత్రానికి ప్రస్తుతం టైటిల్ ఎంపిక ప్రక్రియ జరుగుతోంది.
అలాగే ఈ చిత్రంలో ఆల్లు అర్జున్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా నటిస్తుండగా, ఆయనకు జోడిగా కాజల్ నటిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. జూన్ లో ఆడియో జూలై ప్రథమార్థంలో సినిమా విడుదలవుతుందని తెలుస్తోంది. ఈ చిత్రం తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో ఒక చిత్రం, క్రిష్ ('గమ్యం' ఫేమ్) దర్శకత్వంలో 'వేదం' చిత్రానికి అల్లు అర్జున్ కమిట్ అయ్యారు. వీటి తర్వాత సొంత బ్యానర్ గీతా ఆర్ట్ లోనూ ఓ చిత్రానికి పనిచేస్తారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











