అల్లు అర్జున్ ...సాఫ్ట్ వేర్ ఇంజినీర్

ఇక ఈ చిత్రం కోసం సాఫ్ట్ వేర్ ఫర్మ్ సెట్ యాభై లక్షల రూపాయలతో అన్నపూర్ణ స్టూడియోలో వేసారు.ఇప్పుడు అక్కడే షూటింగ్ జరుగుతోంది. ఆర్య కథ తరహాలో కథనం స్పీడ్ గా ఉంటుందని చెప్తున్న ఈ సినిమా పై పరిశ్రమలో మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ చిత్రాన్ని ఆదిత్య బాబు(జగడం నిర్మాత),బి.వియస్.యన్ ప్రసాద్ కలసి నిర్మిస్తున్నారు. నవదీప్ నెగిటివ్ టచ్ కల్గిన మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే మే తొమ్మిదిన రిలీజ్ అవుతుంది. జగడం వంటి ఫ్లాఫ్ సినిమా తర్వాత చేస్తున్న సినిమా కావటంతో సుకుమార్ కూడా కసితో చేసి హిట్టు కొట్టనున్నాడని అంటున్నారు. పరుగు యావరేజ్ తర్వాత బన్నీ కూడా డెస్పరేట్ గా హిట్ కొట్టాలనే కసిగా ఉన్నాడు.


Click it and Unblock the Notifications











