'పరుగు' పెట్టిస్తున్న అల్లు అర్జన్

By Staff

అల్లు అర్జున్ 'పరుగు' సినిమా విడుదలయి సంవత్సరం దాటిపోయింది. ఆ తర్వాత ఆయన సినిమాలేవీ విడుదల కాలేదు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 'ఆర్య-2' వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇకపై అంత గ్యాప్ రాకూడదనుకున్న అల్లు అర్జున్ వరుస సినిమాలతో తన కెరీర్ ను పరుగు పెట్టిస్తున్నాడు.

ప్రస్తుతం 'ఆర్య-2', గమ్యం ఫేం క్రిష్ రూపొందిస్తున్న 'వేదం', గుణశేఖర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తూ బిజీగా వున్న అల్లు అర్జన్ హీరోగా మరో చిత్రం మొదలు కాబోతోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించబోతున్నారు. 'బదరీనాథ్' గా రూపొందుతున్న ఈ చిత్రానికి 'నరసింహ నాయుడు', 'ఇంద్ర', 'గంగోత్రి' చిత్రాలకు కథ అందించిన చిన్ని కృష్ణ కథను అందించారు. ఓ గుడి నేపథ్యంలో ఈ చిత్రం రూపొందబోతోందని సమాచారం. అల్లు అర్జున్, వి.వి.వినాయక్ కాంబినేషన్ లో 'బన్నీ' తర్వాత వస్తున్న ఈ చిత్రం పై మంచి అంచనాలు వున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X