»   » తెలుగు టైటన్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా అల్లు అర్జున్

తెలుగు టైటన్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా అల్లు అర్జున్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్ కబడ్డీ ఫ్రాంచైజీ ‘తెలుగు టైటన్స్' బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నరు. స్టార్ స్పోర్ట్స్ నిర్వహిస్తున్న ప్రో కబడ్డీ లీగ్(పికెఎల్)లో హైదరాబాద్ ఫ్రాంచైజీ ‘తెలుగు టైటన్స్'కూడా ఒకటి. హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ రోజు నుండి పికెఎల్ ప్రారంభం కానుంది.

ప్రో కబడ్డీ లీగ్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఇందుకు సంబంధించిన వ్యవహారాలు వెల్లడించింది. అల్లు అర్జున్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ లీగ్ లో మొత్తం 8 టీమ్స్ తలపడుతున్నాయి. క్రికెట్ ఐపీఎల్ టి20 తరహాలోనే.... పికెఎల్ నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం జరుగుతున్నది పికఎల్ రెండో సీజన్ టోర్నమెంట్.

అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే...తన తర్వాతి సినిమా బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న ఈ చిత్రాకి ఇద్దరమ్మాయిలతొ సినిమాలో ఇంటర్వెల్ ఫైట్ ని కంపోజ్ చేసిన కెచ్చాను తీసుకున్నట్టు సమాచారం. కెచ్చా..ధాయిలాండ్ కు చెందిన ఫైట్ మాస్టర్.

అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఫైట్ షూటింగ్ తో ప్రారంభమైనట్లు సమాచారం. ఈ సినిమాలో బన్నీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కనపడనుంది. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

English summary
The official Twitter handle of the ProKabbadi read, ” Allu Arjun becomes the newest face of Star Sports Pro Kabaddi, He will inaugurate the Hyderabad leg by singing the national anthem #LePanga.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu