Just In
- 4 min ago
‘క్రాక్’ తర్వాత నందమూరి బాలకృష్ణతో సినిమా: క్లారిటీ ఇచ్చిన గోపీచంద్ మలినేని
- 50 min ago
నాని హీరోయిన్.. మొత్తానికి పెద్ద హీరోనే పట్టేసింది
- 56 min ago
రాగిణి ద్వివేదికి మోక్షం.. ఎట్టకేలకు బెయిల్ మంజూరు
- 1 hr ago
ప్రభాస్ సినిమా సీక్రెట్స్ లీక్ చేసిన కృష్ణం రాజు: రిలీజ్ డేట్.. క్యారెక్టర్స్ ఇలా అన్నీ బయట పెట్టారు!
Don't Miss!
- News
Capital Gains Tax అంటే ఏంటి..? బడ్జెట్ వేళ పూర్తి వివరాలు మీకోసం..!
- Finance
ఫ్యూచర్ గ్రూప్ డీల్, అమెజాన్‌కు షాక్: రిలయన్స్‌కు గుడ్‌న్యూస్, షేర్ జంప్
- Sports
IPL 2021లో అత్యధిక ధర అతనికే.. ఎవరూ ఊహించరు కూడా!!
- Automobiles
భారత్‌లో అడుగుపెట్టిన కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్; ధర & వివరాలు
- Lifestyle
కాజల్ కౌగిలిలో కిచ్లూ ప్రతిరోజూ బంధి అయిపోవాల్సిందేనట...! రోజూ హగ్ చేసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇపుడు అల్లు అర్జున్ ‘జాదుగర్’ అంటున్నారు?
హైదరాబాద్: ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి రకరకాల టైటిళ్లు ప్రచారంలోకి వస్తూన్నాయి. గతంలో ఈ చిత్రం కోసం ‘త్రిశూలం', ‘హుషారు' అనే టైటిల్స్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. తాజాగా ‘జాదుగర్' అనే టైటిల్ కూడా తెరపైకి వచ్చింది. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన జులాయి, జల్సా, ఖలేజా....చిత్రాల టైటిళ్లు పరిశీలిస్తే సెంటిమెంటును ఫాలో అవుతూ...‘జాదుగర్' అనే టైటిల్ తెరపైకి వచ్చినట్లు స్పష్టమవుతోంది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఈచిత్రంలో సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇతర పాత్రల్లో సింధుతులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, ఎం.ఎస్.నారాయణ, రావ్ రమేష్ నటిస్తున్నారు. జులాయి తర్వాత బన్నీతో తాజాగా మరో సినిమా చేస్తున్న త్రివిక్రమ్...ఈ సారి మాత్రం తనకు అలాంటి అపకీర్తి రాకూడదనే ఆలోచనలో ఉన్నారట. అందుకే శరవేగంగా షూటింగ్ కానిచ్చేస్తున్నారు.

వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ వెడ్డింగ్ ప్లానర్‌గా కనిపించనున్నారు. బన్నీ సృష్టించే పెళ్లి సందడి.. వినోదాలు పంచనుంది. ఈ చిత్రం కోసం హైదరాబాద్ శివార్లలో ప్రత్యేకంగా ఓ సెట్ వేశారు. కీలకభాగం చిత్రీకరణ అక్కడే జరిగింది. ఈ నెల 20 నుంచి హైదరాబాద్‌లో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తారు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. సాంకేతిక వర్గం ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్ - దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - పి.డి.ప్రసాద్, నిర్మాత -ఎస్. రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్ శ్రీనివాస్.
దీని తర్వాత అల్లు అర్జున్ చేయబోయే చిత్రం కూడా ఖరారైంది. దర్శకుడు విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో ఓ సినిమా ఖరారైంది. ఇటీవలే ఈ దర్శకుడు నాగ చైతన్యతో ‘ఒక లైలా కోసం' అనే చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి విజయ్ కుమార్ కొండ మాట్లాడుతూ...‘అల్లు అర్జున్‌ను కలిసి ఇటీవల ఓ స్టోరీ గురించి చెప్పాను. అతనికి చాలా నచ్చింది. నాతో కలిసి పని చేయడానికి ఇంట్రెస్ట్ చూపాడు. అయితే ఈ సినిమా ఇంకా అపీషియల్‌గా ఓకే కాలేదు. ప్రాజెక్టు ఇంకా మెటీరియలైజ్ కావడానికి సమయం పడుతుంది' అని తెలిపారు. స్ర్కిప్టుకు ఫైనల్ టచ్ ఇచ్చిన తర్వాత సినిమాను అఫీషియల్‌గా ప్రకటించనున్నారు.