Allu Arjun: న్యూయార్క్​లో అల్లు అర్జున్​కు అరుదైన గౌరవం.. తగ్గేదే లే అంటూ డైలాగ్​

టాలీవుడ్​లో ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్​కు ఉన్న క్రేజ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆయన సుకుమార్​ డైరెక్షన్​లో నటించిన పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. తగ్దేది లే.. అనుకుంటూ పాన్​ ఇండియా స్టార్​గా పేరు తెచ్చుకున్నాడు బన్నీ. ఈ సినిమా అల్లు అర్జున్​కు​ ఇండియా లెవెల్లో క్రేజ్ వచ్చింది. పుష్ప చూసిన నార్త్​ ప్రేక్షకులు బన్నీ డైలాగ్స్​, నటన, డ్యాన్స్​కు ఫిదా అయ్యారు. అల్లు అర్జున్​ మేకవర్​, యాటిట్యూడ్​ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లు రాబట్టడం విశేషం. ఇదిలా ఉంటే తాజాగా అల్లు అర్జున్​కు ఓ అరుదైన గౌరవం దక్కింది.

పుష్పతో దేశవ్యాప్తంగా క్రేజ్​ సంపాదించుకున్న ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్​కు అరుదైన గౌరవం లభించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇండియా పరేడ్​కు బన్నీ నాయకత్వం వహించే అవకాశం వచ్చింది. ఈ పరేడ్​కు అల్లు అర్జున్​ నాయకత్వం వహించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి.

Allu Arjun As Marshal Grand To The Biggest Indian Parade In New York

75వ భారత స్వాతంత్య దినోత్సవ వేడుకలలో భాగంగా న్యూయార్క్​లో ఇండియా డే పరేడ్​ను ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియన్​ అసోసియేషన్స్​ ఎంతో కలర్​ఫుల్​గా నిర్వహించింది. ఆగస్టు 21న జరిగిన ఈ గ్రాండ్​ ఇండియా పరేడ్​కు అల్లు అర్జున్ గ్రాండ్​ మార్షల్​​గా హాజరయ్యారు.

ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్​ నేపథ్యంలో నిర్వహంచిన ప్రపంచంలోనే అతిపెద్ద ఇండియా పరేడ్​లో సుమారు 5 లక్షల మందికి భారతీయులు పాల్గొన్నారు. వీరంతా జాతీయ జెండాలను ఒకేసారి ప్రదర్శించడంతో ఒక రికార్డ్​ను సాధించారు.

Allu Arjun As Marshal Grand To The Biggest Indian Parade In New York

ఈ వేడుకలో అత్యధిక మంది ప్రవాస భారతీయులు సమిష్టిగా డ్రమ్స్ వాయించడం ద్వారా మరో వరల్డ్ రికార్డును సృష్టించారు. పుష్పతో ఇండియా వైడ్​గా పాపులారిటీ సాధించిన అల్లు అర్జున్​ గ్రాండ్​ మార్షల్​​గా రావడంతో న్యూయార్క్​ వీధులు ప్రవాస భారతీయులతో కిక్కిరిసిపోయాయి.

అయితే ప్రతీ ఏటా న్యూయార్క్​లో ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియన్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఆగస్టులో జరిగే పరేడ్​ రోజున న్యూయార్క్​ వీధులన్నీ భారత దేశ త్రివర్ణపతాకం శోభితంగా మారతాయి.

Allu Arjun As Marshal Grand To The Biggest Indian Parade In New York

ఈసారి 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మరింత జోష్​తో కలర్​ఫుల్​గా ఇండియా పరేడ్​ నిర్వహించారు. ఈ పరేడ్​కు గ్రాండ్​ మార్షల్​​గా వ్యవహరించిన అల్లు అర్జున్​ ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ 'యే భారత్​కా తిరంగా హై.. కబీ ఝుకేగా నహీ' (ఇది భారతదేశ త్రివర్ణ పతాకం.. తగ్గేదేలే..)​ అంటూ పుష్ప డైలాగ్​తో జోష్​ నింపాడు.

Allu Arjun As Marshal Grand To The Biggest Indian Parade In New York

అలాగే భారతీయుడిగా జన్మించినందుకు గర్వపడుతున్నట్లు అల్లు అర్జున్​ తెలిపాడు. ఇక గ్రాండ్​ మార్షల్​గా వ్యవహిరించిన బన్నీకి అక్కడి మేయర్​ ఆమమ్స్​ సర్టిఫికేట్​ ఆఫ్​ రికగ్నిషన్​ బహుకరించాడు. ఈ వేడుకల్లో అల్లు అర్జున్​ భార్య స్నేహ రెడ్డి కూడా పాల్గొంది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X