'సత్య' - పవర్ ఫుల్ పోలీస్ గా అల్లు అర్జున్
హైదరాబాద్: అల్లు అర్జున్ సినిమాలకు ఉన్న క్రేజే వేరు. ఆయన ఓ సినిమాలో నటించారంటే..ఆ సినిమాలో అతని పాత్ర ఏంటి...ఆ పాత్ర పేరేంటి..అన్న ఎంక్వైరీలు అభిమానులు మొదలవుతాయి. ఈ సంక్రాంతికి ఆయన గెస్ట్ రోల్ లో చేసిన చిత్రం 'ఎవడు' విడుదల అవుతోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ పేరు సత్య అని, అతనికి ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ అని తెలుస్తోంది. అయితే ఆ పాత్ర కొద్ది సేపే అంటే పది నిముషాలు మాత్రమే తెరపై ఉంటుంది. కానీ ఉన్నంత సేపూ ఊపేస్తుందని చెప్పుతున్నారు.
తెలుగువాళ్లకు సంక్రాంతి సంబరాలు బోగీనాటి నుంచే మొదలవుతాయి. అయితే ఈ ఏడాది నాలుగైదు రోజుల ముందు నుంచే తీసుకురావడానికి మన కథానాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. రామ్‌చరణ్ తన అభిమానులకు, ప్రేక్షకులకు రెండు రోజుల ముందే 'ఎవడు' రూపంలో వినోదాన్ని పంచబోతున్నారు. అవును 'ఎవడు' సినిమాని ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
శ్రుతిహాసన్, అమీ జాక్సన్ హీరోయిన్స్ గా చేసిన ఈ చిత్రానికి వంశీపైడిపల్లి దర్శకత్వం వహించారు. దిల్ రాజు నిర్మాత. సినిమా ప్రత్యేక ప్రచార చిత్రాన్ని ఈ నెల 3న విడుదల చేస్తున్నారు. ''బతికితే ఆశలు... పోతే ప్రాణాలు అనుకునే తత్వం ఉన్న యువకుడి కథ ఇది. రామ్‌చరణ్ ...నాయకుడి పాత్రలో మరోసారి ప్రేక్షకుల్ని అలరించనున్నాడు. అల్లు అర్జున్, కాజల్ ప్రత్యేక పాత్రలు సినిమాకి అదనపు ఆకర్షణ. దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలకు మంచి స్పందన వచ్చింది'' అన్నారు నిర్మాత. కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, కళ: ఆనంద్‌సాయి, సహనిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్. నూతన సంవత్సరం సందర్భంగా బీజియంతో కూడిన కొత్త టీజర్‌ని మంగళవారం ఆన్‌లైన్‌లో విడుదల చేశారు.


Click it and Unblock the Notifications












