'వరుడు' అల్లు అర్జన్
'వరుడు' ఎన్నో రోజులుగా అందరి నోళ్లలో నానుతున్న పేరు. మహేశ్ బాబు, త్రివిక్రమ్ ల క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రానికి ఈ టైటిల్ ఖరారు చేసారన్న వార్తలు బలంగా వినిపించాయి. మహేశ్ బాబు కూడా ఓ ఇంటర్యూలో మా చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చెయ్యలేదని స్పష్టం చేసినప్పటికీ వరుడు మాత్రం బాగా ప్రాచుర్యం పోందింది.
తాజాగా అల్లు అర్జున్, గుణశేఖర్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రానికి 'వరుడు' టైటిల్ ను ఖరారు చేసారు. యూనివర్సల్ మీడియా పతాకం పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ఓ కొత్త కథానాయిక పరిచయం కానుంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
More from Filmibeat
allu arjun varudu guna sekhar mahesh babu trivikram universal media dvv danaiah అల్లు అర్జన్ వరుడు గుణశేఖర్ మహేశ్ బాబు త్రివిక్రమ్ యూనివర్సల్ మీడియా డివివి దానయ్య


Click it and Unblock the Notifications











