‘మీలో బద్రినాథ్...మిర్చిలో బద్రినాథ్’ రేడియోమిర్చిలో తిష్టవేసిన బన్నీ...!?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..రేడియో మిర్చిలో సందడి చేశారు. తన తాజా చిత్రం బద్రినాథ్ సాధించిన ఘనవిజయాన్ని ఆయన అభిమానులతో పంచుకున్నారు. 'బద్రినాథ్" చిత్రానికి సంబంధించి రేడియో మిర్చి ఓ కాంటెస్ట్ నిర్వహించింది. ఈ కాంటెస్ట్ లో పాల్గొన్నవారు సినిమాకి సంబంధించిన టైటిల్ ట్రాక్ కు 4లైన్లు లిరిక్ రాయాలి. అలాగే సినిమా పాట కూడా పాడాలి. రేడియో మిర్చి నిర్వహించిన ఈ కాంటెస్ట్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ కాంటెస్ట్ లో పాల్గొన్న వారిలో 5గురు విజేతలుగా ఎంపికయ్యారు. ఈ 5గురికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని కలిసే అవకాశం కల్పించింది రేడియో మిర్చి. ఈ విజేతలను కలుసుకున్న అల్లు అర్జున్ వీరితో సరదాగా కబుర్లు చెప్పాడు..
విజేతలందరూ అల్లు అర్జున్ ని కలిసినందకు తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ 'అందరూ ఈ సినిమాని చూడాలి. ఓ యువకుడి భక్తి, ప్రేమ ప్రయాణం ఈ సినిమా. ఉత్తమ విలువలతో ఈ సినిమాని రూపొందించడం జరిగింది. అందుకే అందరూ చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నారు" అని చెప్పాడు. తన ప్లాప్ సినిమాని ఎలాగైనా హిట్ చేయాలనే తపనతో హీరో అల్లు అర్జున్ రేడియో మిర్చిలో తిష్టవేసుకుని కూర్చుని తనదైన స్టయిల్ లో 'బద్రినాథ్"కు పబ్లిసిటీ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











