బాహుబలి మాదిరిగానే ఇది కూడా... : అల్లు అర్జున్ కామెంట్

జాతీయ అవార్డు దక్కించుకున్న శతమానం భవతి చిత్ర యూనిట్ ను అభినందించేందుకు ఓ చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్.

By Bojja Kumar

హైదరాబాద్: దిల్ రాజు నిర్మాణంలో సతీష్ వేగ్నేశ దర్శకత్వంలో తెరకెక్కిన 'శతమానం భవతి' చిత్రం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 64వ జాతీయ చలనచిత్ర అవార్డుల లిస్టులో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ఇది జాతీయ అవార్డు దక్కించుకుంది.

ఈ సందర్భంగా హైదరాబాద్ లో చిత్ర యూనిట్ ను అభినందించేందుకు ఓ చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు బన్నీ, నాని తదితరులు పాల్గొన్నారు.

దిల్ రాజుతో అనుబంధ: గురించి బన్నీ

దిల్ రాజుతో అనుబంధ: గురించి బన్నీ

దిల్ రాజుతో నాకు చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంది. ఇద్దరం ఒకేసారి కెరీర్ మొదలు పెట్టాం. ఆయన దిల్ సినిమా, నా గంగోత్రి ఒకేసారి రిలీజైంది. మా ఇద్దరి రెండో చిత్రం ఆర్య. అక్కడి నుండి మా ప్రయాణం మొదలు పెడితే... ఈ రోజు నేను ఆయన 25వ సినిమా చేస్తున్నాను అని అల్లు అర్జున్ అన్నారు.

తెలుగులో రేర్ అవార్డ్

తెలుగులో రేర్ అవార్డ్

శతమానం భవతి సినిమా గురించి మా నాన్న వచ్చి రాజుకు అభినందన సభ ఏర్పాటు చేద్దామన్నారు. కానీ దీనికి జస్ట్ కంగ్రాజ్యులేషన్స్ సరిపోదు. ఇప్పటి వరకు తెలుగులో మూడే సినిమాలకు ఇలాంటి అవార్డ్స్ వచ్చాయి. శంకరాభరణం, గీతాంజలి... ఇపుడు మూడో మూవీ ‘శతమానం భవతి'. మన తెలుగు సినిమాకు రేర్ గా వచ్చే అవకాశం ఇది అన్నారు.

బాహుబలి మాదిరిగానే ఇది కూడా..

బాహుబలి మాదిరిగానే ఇది కూడా..

బాహుబలి సినిమా మనల్ని నేషనల్ స్థాయిలో పెట్టింది. శతమానం భవతి కూడా తెలుగు సినిమాకు నేషనల్ స్థాయిలో గుర్తింపు వచ్చేలా చేసింది అని బన్నీ ఈ సందర్బంగా వ్యాఖ్యానించారు.

దిల్ రాజు-బన్నీ డిజె

దిల్ రాజు-బన్నీ డిజె

ప్రస్తుతం దిల్ రాజు, బన్నీ కాంబినేషన్లో ‘దువ్వాడ జగన్నాధమ్' (డిజె) చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X