శ్రీవారి సేవలో :కుటుంబసభ్యులతో అల్లు అర్జున్(ఫొటో)
హైదరాబాద్: అల్లు అర్జున్ సోమవారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. భార్య స్నేహ, కొడుకు అయాన్, తండ్రి అల్లు అరవింద్‌తోపాటు పలువురు కుటుంబసభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.
https://www.facebook.com/TeluguFilmibeat
ప్రస్తుతం బన్ని చేస్తున్న చిత్రం విశేషాలుకు వస్తే...
అల్లు అర్జున్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. త్రిశూలం అనే వర్కింగ్ టైటిల్ అనుకుంటున్న ఈ చిత్రం అందుతున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి 5,2015 విడుదల తేదీని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై అధికారిక సమాచారం ఏమీ లేదు.
రీసెంట్ గా హైదరాబాద్ నగర శివార్లలో చిత్రీకరణ జరుగింది. కోకా పేటలో ఓ ఇంటి సెట్‌ని కళా దర్శకుడు ఎస్.రవీందర్ ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఈ ఇంట్లోనే చిత్రీకరణ జరుగింది. బన్ని, సమంత, నిత్యమేనన్, ఉపేంద్ర, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావులపై కీలక సన్నివేశాలు తెరకెక్కించారు.

'అత్తారింటికి దారేది'లో కుటుంబ బంధాల్ని తెరపై హృద్యంగా ఆవిష్కరించారు త్రివిక్రమ్. ఓ స్టార్ హీరో కోసం అలాంటి కథని ఎంచుకోవడం సాహసమే. అయితే ఈ ప్రయత్నంలో ఆయన విజయవంతమయ్యారు. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాకీ అదే దారిలో వెళ్తున్నారు. అల్లుఅర్జున్, త్రివిక్రమ్ కలయికలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సమంత, నిత్యమేనన్, ఆదా శర్మ హీరోయిన్స్. ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు.
''కుటుంబ బంధాల నేపథ్యంలో సాగే కథ ఇది. యాక్షన్ కూడా ఉంటుంది. జులాయి కాంబినేషన్ ఈ చిత్రంతో మరోసారి పునరావృతం అవుతోంది. ఆ సినిమాకు మించిన వినోదాలు ఇందులోనూ చూడొచ్చు'' అని నిర్మా్త చెబుతుతున్నారు. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ చిత్రం కీ సీన్స్ షూటింగ్ జరుగుతోంది. అలాగే ఈ చిత్రంలో ఉపేంద్ర నెగిటివ్ పాత్ర చేస్తాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ పాత్ర నెగిటివ్ కాదని..ప్యారలల్ గా సాగే పాత్ర అని సినిమాలో మరో లీడ్ క్యారెక్టర్ లాంటిదని తెలుస్తోంది. అందుకే ఉపేంద్ర ఒప్పుకున్నాడని తెలుస్తోంది. ఇదివరకు 'జులాయి'తో సందడి చేసిన ఈ కలయికపై భారీ అంచనాలు నెలకొన్నాయి


Click it and Unblock the Notifications











