'వరుడు' ఘనవిజయం...అల్లు అర్జున్
మంచి ఉద్దేశంతో తీసిన వరుడు సినిమా అభిమానుల ఆశీస్సులతో ఘన విజయం సాధించిందని అల్లు అర్జున్ చెప్పారు. మెహిదీపట్నం క్రిస్టల్ గార్డెన్‌లో మా టీవీ వరుడు కాంటెస్ట్‌లో గెలుపొందిన జయకృష్ణ వివాహానికి 'వరుడు' సినిమా దర్శకుడు గుణశేఖర్, హీరోయిన్ భానుశ్రీ మెహ్రా, అర్జున్ విచ్చేశారు. ఈ సందర్భంగా వధూవరులు జయకృష్ణ, అమరావతిలకు శుభాకాంక్షలు తెలిపి బహుమతిని అందజేశారు. అనంతరం అల్లు అర్జున్ మాట్లాడుతూ..సంప్రదాయ పెళ్లిళ్లు జీవితాంతం గుర్తుండిపోతుందన్నారు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా నిర్వహించిన ఈ కాంటెస్ట్‌లో పాల్గొన్న ఎంతోమంది తమ పెళ్లిళ్లకు రావాల్సిందిగా ఆహ్వానాలు పంపుతున్నారని, వీలునుబట్టి ఎంపిక చేసిన వారి వివాహాలకు తప్ప హాజరవుతామని చెప్పారు. వివాహం, దాంపత్యం, సంతానం, ప్రపంచం అనే ఉద్దేశంతో నిర్మించిన వరుడు సినిమా అందరికీ ఆదర్శంగా నిలవగలదని గుణశేఖర్ చెప్పారు. హీరోయిన్ భానుశ్రీ మెహ్రా వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.


Click it and Unblock the Notifications











