భార్యతో కలిసి బన్నీ ఒలంపిక్స్ టూర్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డితో కలిసి లండన్ లో జరుగుతున్న ఒలంపిక్స్ ఓపెనింగ్ సెర్మనీలో పాల్గొనేందుకు వెలుతున్నారు. ప్రస్తుతం బన్నీ నటిస్తున్న 'జులాయి' చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు ముగియగానే ఇక్కడి నుంచి వెళ్లే అవకాశం ఉందని, పలువురు బాలీవుడ్ స్టార్లతో కలిసి బన్నీ లండన్ వెలుతున్నట్లు సమాచారం. ఈనెల 27న ఒలంపిక్స్ ఓపెనింగ్ సెర్మనీ ముగియగానే ఆగస్టు 3న బన్నీ తిరిగి వస్తారని తెలుస్తోంది. ఇదే సమయంలో తన వెన్నుముఖ గాయానికి కూడా లండన్‌లో చికిత్స చేయించుకుంటారని వినికిడి.
జులాయి చిత్రం ఆగస్టు 9న విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1600 థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చాలా కాలంగా సరైన హిట్ లేని అల్లు అర్జున్, త్రివిక్రమ్ ఈ సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. విడుదలకు ముందే ఈ చిత్రంపై ఈ రేంజిలో అంచనాలు ఉండటంతో సినిమా హిట్టవుతుందనే నమ్మకంతో ఉన్నారంతా.
ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: రవీందర్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, బ్యానర్: హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సమర్పణ: డివివి దానయ్య, నిర్మాత: ఎన్. రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications












