అల్లు అర్జున్ అందుకే మీడియాను దూరంగా పెడుతున్నారా
అల్లు అర్జున్ గత కొద్ది రోజులుగా మీడియా ముందుకు రావటానికి ఇష్టపడటం లేదు. బద్రీనాధ్ లొకేషన్స్ కి మీడియావారు వెళ్ళినా తప్పించుకుని వెళ్ళారుకానీ వారితో గతంలో ముచ్చటించకపోవటంతో ఇది ఒక చర్చనీయాంశంగా మీడియా సర్కిల్స్ లో మారింది. దీనికి కారణం అతని తాజా పెళ్ళి సంగతే అంటున్నారు. మీడియాకు దొరికితే అమ్మాయి గురించి, అతని ప్రేమ వ్యవహారం గురించి, ముఖ్యంగా వరుడు సమయంలో తల్లితండ్రులు చూపిన పిల్లనే చేసుకుంటానని చెప్పిన మాటలు గురించి అడుగుతారనే మీడియాని తప్పించుకుతిరుగుతున్నాడని చెప్తున్నారు. ఇక బన్నీ వివాహం స్నేహా రెడ్డితో పిబ్రవరి 2011న జరగనుందని అల్లు అరవింద్ మీడియాకు చెప్పారు. ఇబ్రహీంపట్నంలో బిటెక్ చేసి అమెరికాలో ఎమ్మెస్ చేసిన స్నేహారెడ్డి తండ్రికి విద్యాసంస్థలు ఉన్నాయి. అల్లు ఆర్జున్ కు స్నేహారెడ్డితో గత సంవత్సర కాలంగా పరిచయం ఉంది.


Click it and Unblock the Notifications