twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్యాక్ టు బ్యాక్ స్టైలిష్ లుక్ తో అల్లు అర్జున్...!

    By Sindhu
    |

    కెరీర్ ప్రారంభంలో యూత్ కి నచ్చే పాత్రలు పోషించిన అల్లు అర్జున్ తన మావయ్య చిరంజీవి చేత 'స్టైలిష్ స్టార్" అని కూడా పిలిపించుకున్నాడు. స్టయిల్ కి డిఫినిషన్ గా అల్లు అర్జున్ ని అభిమానులు తెగ పొగిడేస్తూ ఉంటారు. అయితే ఇటీవల అతను చేసిన చిత్రాల్లో అల్లు అర్జున్ ట్రేడ్ మార్క్ స్టైల్ మిస్ అవుతోందని అభిమానుల ఆవేదన. అందుకు తగ్గట్టు గానే అతని సినిమాలు సైతం మిస్ ఫైర్ అవుతున్నాయి.

    అందుకే బద్రినాథ్, వరుడు, వేదం తదితర చిత్రాలతో ఆ విషయాన్ని గ్రహించిన అల్లు అర్జున్ ఈసారి తన బలాన్ని మాత్రమే నమ్ముకుంటున్నాడు. వరుస పరాజయాల నుంచి విముక్తి కోసం ఇక తన చేసే సినిమాలంటిలో తన ట్రెండ్ మార్చనున్నాడని ఫుల్ ఎనర్జిటిక్ గా దర్శనమివ్వనున్నాడని సమాచారం.

    కాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం మూడు సినిమాలు కమిట్ అయినట్టుగా సమాచారం. అందులో మొదటిది యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మించే త్ర్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా మూవీ. రెండవది శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించే వాసు వర్మ దర్శకుడిగా మూవీ. కాగా మూడవది శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివి యస్ యన్ ప్రసాద్ నిర్మించే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడిగా మూవీ.

    కానీ సినిమా స్టార్ట్ అయ్యాకే అవి కన్‌ ఫర్మ్ అయినట్టు. అయితే అతి త్వరలో స్టార్ట్ అయ్యే మూవీ యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మించే త్ర్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా రూపొందే చిత్రం అని సమాచారం. అల్లు అర్జున్ 'బద్రీనాథ్" చిత్రం కోసం ఒక ప్రత్యేక గెటప్‌ లో కనిపించారు. ఆ పాత్ర పరిధి మేరకు హెయిర్ స్టైల్, డ్రస్సింగ్ స్టైలిష్‌ గా కనిపించడానికి అస్కారం లేదు. కానీ ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రం‌లో ఫుల్ స్టైలిష్ గా సరికొత్త హెయిర్ స్టైల్‌ తో సరికొత్త డ్రస్సింగ్‌ తో మన ముందుకు రాబోతున్నాడని అల్లు శీరీష్ ట్విట్ చేసాడు.

    English summary
    Recent film characters dint need him to be stylish, but film he will be back in his elements! Trendy hair and clothes tweeted Allu Sirish.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X