బద్రినాథ్ తో హీరోగా మరో మెట్టు పైకి..అల్లు అర్జున్

By Sindhu

ఈ సినిమా ఆరంభించినప్పట్నుంచి విడుదల వరకు విజయంపై మాకు పూర్తి నమ్మకం ఉండేది. అయితే విడుదలైన తొలి, మలి రోజు టాక్ విని కాస్త బాధపడ్డాం. ఆ తర్వాత వసూళ్లు అనూహ్యంగా పుంజుకున్నాయి. 187 సెంటర్స్‌లో 50రోజులు పూర్తి చేసుకుందీ చిత్రం. డబ్బు కోసం కాకుండా బన్నీ (అల్లు అర్జున్)ని గొప్పగా చూపించాలనే కోరికతో తీసిన చిత్రం ఇది. అందరూ బన్నీ గొప్పగా చేశాడంటుంటే తండ్రిగా చాలా సంతోషంగా ఉంది" అని అల్లు అరవింద్ అన్నారు. అల్లు అర్జున్, తమన్నా జంటగా వివి వినాయక్ దర్శకత్వంలో ఆయన నిర్మించిన 'బద్రినాథ్" 50రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన అర్ధ శతదినోత్సవ వేడుకలో అరవింద్ పై విధంగా స్పందించారు.

వినాయక్ మాట్లాడుతూ 'మొదటిరోజు ఈ చిత్రం టాక్ విని ఇక డెరైక్షన్ మానేయాలనిపించింది. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. అయితే ఆ తర్వాత ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందడం ఆనందానికి గురి చేసింది. బన్నీకి మంచి పేరు రావాలనే ఆశయంతో ఈ చిత్రం చేశాం. డాన్సులు, ఫైట్లు ఎంతో కష్టపడి చేశాడు. గౌరవప్రదమైన సినిమాగా 'బద్రినాథ్" నిలడినందుకు ఆనందంగా ఉంది"" అన్నారు.

అల్లు అర్జున్ మాట్లాడుతూ 'మొదట్నుంచి ఈ చిత్రవిజయంపై నాకు పూర్తి నమ్మకం ఉండేది. దానికి కారణం మేము పడిన కష్టం. నన్ను హీరోగా మరో మెట్టు పైకి తీసుకెళ్లిన చిత్రం ఇది. వసూళ్ల పరంగా, అన్ని విధాలుగా నా కెరీర్‌లోనే బెస్ట్ సినిమా" అన్నారు. 'తన సినిమా కెరీర్‌లోనే ఎక్కువ వసూళ్లు కురిపించిన చిత్రం ఇది అని బన్నీ అన్నారు. ఓ రచయితగా నాకు అంతకన్నా కావల్సిందేముంది. మళ్లీ బన్నీకి ఇంతకన్నా మంచి కథ ఇస్తా" అని చిన్నికృష్ణ అన్నారు. ఇంకా ఈ వేడుకలో గౌతంరాజు, ఆనందసాయి, కమల్‌కన్నన్, రాజేంద్రకుమార్, తమన్నా తదితరులు కూడా పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X