twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్ పెళ్ళి తర్వాత మొదటి సినిమా పై హైఎక్స్ పెక్టేషన్స్..!

    By Sindhu
    |

    వివి వినాయక్ దర్శకత్వంలో అల్లు అర్జున్, తమన్నా నటించిన 'బద్రీనాథ్" షూటింగ్ పూర్తి చేసుకుంది. కీరవాణి సమకూర్చిన సంగీతంలో పాటలను త్వరలోనే ఆడియో రిలీజ్ లో విడుదల చెయ్యాలని, జూన్ లో సినిమాని విడుదల చెయ్యాలనీ గీతా ఆర్ట్స్ వారు ఉవ్విళ్ళూరుతున్నారు. అవకాశాలు రావటంకోసం, అభిమానులను అలరించటం కోసం ఒకప్పుడు హీరోయిన్లే అందాలను కాపాడుకునేవారు. ఈ మధ్యకాలంలో హీరోలు అంతకంటే ఎక్కువ శ్రమపడుతున్నారు. మేకప్ మీద ఎక్కువ ఆధారపడకుండా కథను బట్టి గడ్డం, మీసం, జుట్టు పెంచుకోవటం, తగ్గించుకోవటం లాంటివే కాకుండా శరీరాకృతులను పెంచుకోవటం తగ్గించుకోవటం కూడా చేస్తున్నారు. అంతకుముందు 'యమదొంగ" కోసం జూ ఎన్టీఆర్ ఒళ్ళు తగ్గించుకున్నాడు. ఇప్పుడు 'మిస్టర్ ఫర్ ఫెక్ట్" కోసం ప్రభాస్ ఒళ్ళు తగ్గించుకుంటే, 'బద్రీనాథ్" కోసం బన్నీ కండలు పెంచుకున్నాడు. హిందీలో 'గజినీ" కోసం కండలు బాగా పెంచుకున్న అమీర్ ఖాన్ కొద్ది రోజుల్లోనే '3ఇడియట్స్" కోసం వాటిని కరిగించుకున్నాడు. అల్లు అర్జున్ పెళ్ళి తర్వాత రాబోతున్న మొదటి సినిమా పై చాలా ఎక్స్ పెక్టేషన్సే పెట్టుకొన్నారు దర్శకుడు...

    'మగధీర" కోసం రామ్ చరణ్ గుర్రపు స్వారీ నేర్చుకుంటే తాజాగా 'బద్రీనాథ్" కోసం బన్నీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. కమల్ కన్నన్ స్పెషల్ ఎఫెక్ట్స్ తో, పీటర్ హెయిన్స్ కొరియో గ్రాఫితో, అల్లు అర్జున్, తమన్నా, యం యం కీరవాణి కాంబినేషన్ లో ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని వివి వినాయక్ అంటున్నారు.

    English summary
    Stylish star Allu Arjun’s much awaited film Badrinath is going to release in the month of June it seems. The movie makers are planning to release the audio shortly. Allu Arjun took some special training in Vietnam for the role in Badrinath. Milky beauty Tamanna is pairing up with Bunny in this film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X