‘మగధీర’కు ధీటుగా బన్నీ'బద్రీనాథ్' భారీ బడ్జెట్ 35 కోట్లు...!?
అల్లు అర్జున్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మిస్తున్న చిత్రం 'బద్రీనాథ్' తెలుగు చలన చిత్ర చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌గా సినీజనం లెక్కలు కడుతున్నారు. దాదాపు 35 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు వినికిడి. తెలుగులో విజయవంతమైన 'నరసింహనాయుడు' చిత్రానికి కథను అందించిన విశిష్ట రచయిత చిన్నికృష్ణ. రజనీకాంత్ హీరోగా విజయవంతంగా ప్రదర్శింపబడిన 'నరసింహ' అనే చిత్రానికి చిన్నికృష్ణ మొదటి కథను అందించారు. ఆ తర్వాత మరో రెండు తమిళ సినిమాలకు కూడా కథలు అందించి రచయితగా సినిమా రంగంలో మంచి పేరును సంపాదించారు. తక్కువ సమయంలో కథా రచయితగా ఎంతో ఎత్తుకు ఎదిగిన చిన్నికృష్ణ 'బద్రీనాథ్"ఈ చిత్రానికి కథ అందించారు.
ఆయన ఏనాడో రాసుకున్న ఈ కథని ఇంతదాకా ఎవరూ తెరకెక్కించే సాహసం చేయకపోవడానికి కారణం బడ్జెట్. స్థాయికి మించిన ఖర్చు అవుతుందనే ఎవరూ ముందుకురాలేదు. గతంలో ఈ సినిమాను చేయాలని ప్రభాస్ ఎంతగానో ఆశించాడంట. దీనిని తమ స్వంత బ్యానర్‌లో నిర్మించాలని కృష్ణంరాజు కూడా అనుకున్నాడంట. కానీ అంతలోనే 'బిల్లా' రావడం, దాదాపు 18 కోట్ల రూపాయలతో రూపొందిన ఆ సినిమా అనుకున్న ఫలితాన్ని ఇవ్వక పోవడం కారణాల వల్ల వదులుకున్నారు. దాంతో ఆ కథను పట్టుకుని చిన్నికృష్ణ చాలామంది దగ్గరికి వెళ్లాడంట. 'మగధీర' తర్వాత అల్లు అరవింద్‌ని కలవడం, అది బన్నీకి తెగ నచ్చడం జరిగిపోయాయి. భారీ బడ్జెట్‌తో గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యత ఇచ్చే ఈ చిత్రానికి కీరవాణి సంగీతం, రవివర్మన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











